బెంగళూరు vs హైదరాబాద్.. ఏ సిటీ బెస్ట్..? ఆన్సర్ తెలిస్తే షాక్ అవుతారు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్, కర్ణాటక రాజధాని బెంగళూరు రెండూ భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరాలు. బెంగళూరు జనాభా కోటీ 50 లక్షల మంది వరకు ఉండగా.. హైదరాబాద్ జనాభా కోటీ 20 లక్షల మంది వరకు ఉన్నారు. బెంగళూరు మహా నగరం ప్రస్తుతం భారత్ లోని మెట్రో నగరాల్లో మూడో స్థానంలో ఉంది. ముంబై, దిల్లీ తర్వాత బెంగళూరు ఉంది. ఇక హైదరాబాద్ నాలుగోస్థానంలో ఉంది. హైదరాబాద్ ను మిని ఇండియా అని పిలుస్తుంటారు. ఇక్కడ అనేక భాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు బిహార్, యూపీ, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది ఉద్యోగం, ఉపాధి కోసం ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు.

మరోవైపు బెంగళూరులో కన్నడ, తెలుగు, తమిళం భాషలు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలు తక్కువగానే కనిపిస్తుంటారు. ఐటీ, స్టార్టప్ రంగాలు పెరిగిన నేపథ్యంలో లక్షలాది మంది బెంగళూరుకు వలస వస్తుంటారు. ఇక హైదరాబాద్ తో పోల్చుకుంటే.. బెంగళూరులో ఇంటి అద్దెలు, రోజూవారీ ఖర్చులు ఎక్కువని సమాచారం.. అందుకే హైదరాబాద్ ను అందరూ బడ్జెట్ ఫ్రెండ్లీ అని పిలుస్తున్నారు. అయితే బెంగళూరుకు ప్లస్ పాయింట్ ఇక్కడి వాతావరణం.. ఇక్కడ 365 రోజులూ చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కానీ హైదరాబాద్ లో సాధారణంగా పొడి వాతావరణం ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి.

అయితే ఇప్పుడు ఓ యువ ఉద్యోగి రెడ్డిట్ మాధ్యమంలో పెట్టిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో బెంగళూరు vs హైదరాబాద్ పై లైవ్ డిబేట్ నడుస్తోంది. భారత్ లోనే రెండు పెద్ద టెక్నాలజీ హబ్ లుగా ఉన్న ఈ నగరాలపై డిబేట్ నడుస్తోంది. రీసెంట్ గా బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ అయిన ఓ ఉద్యోగి.. హైదరాబాద్ లో తన 5 నెలల అనుభవాన్ని పంచుకున్నారు. హైదరాబాద్ లో వేసవిలో అనేకసార్లు పవర్ కట్స్, వేడి వాతావరణం కారణంగా ఇబ్బంది పడినట్లు తెలిపారు. అదే బెంగళూరులో ఏడాది పొడవునా చల్లని వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు.

Viral Sensation on Reddit Bengaluru vs Hyderabad Comparison Thread Creates Huge Buzz HydvsBenglru

ఇక బెంగళూరు రోడ్లతో పోల్చితే హైదరాబాద్ రోడ్లు బెటర్ అని యూజర్ తన పోస్టులో పేర్కొన్నారు. ఇక్కడ పాట్ హోల్స్ తక్కువేనని తెలిపారు. హైదరాబాద్ లో ఫుడ్ సూపర్ అని అలాగే ఇక్కడి లోకల్ ప్రజలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారని హిందీ, తెలుగు మాట్లాడతారని.. కానీ బెంగళూరులో ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడతారని తెలిపారు. అలాగే బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్ లో ట్రాఫిక్ కూడా తక్కువేనని తెలిపారు.

Posts from the hyderabad
community on Reddit

అయితే అతని పోస్టుపై నెటిజన్ల నుంచి మిక్స్ డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కొందరు హైదరాబాద్ కు పాజిటివ్ గా మాట్లాడుతుంటే.. మరికొందరు బెంగళూరు నగరాన్ని సమర్థిస్తున్నారు. దాంతో ఈ రెడ్డిట్ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+