AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీపై ఎస్ఈసీ కీలక నిర్ణయం- ఈ షరతులతో..!
ఏపీలో ప్రతీ నెలా ఒకటో తేదీన ఇచ్చినట్లే నవంబర్ 1న పెన్షన్ల పంపిణీ (AP Pensions) చేయాల్సి ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముందుగానే పెన్షన్లను పంపీణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్ధల ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం అనుమతి కోరింది. దీనిపై ఇవాళ ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీ విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది.
రాష్ట్రంలో ఎప్పటిలాగే పెన్షన్ల పంపిణీకి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఎన్నికల కమిషన్ అంగీకరించింది. అయితే వీటి కోసం కొన్ని షరతులు పెట్టింది. పెన్షన్లను ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేయాలని షరతు పెట్టింది.
కొత్తగా ఎవరినీ పింఛన్ లబ్ధిదారుల జాబితాలో చేర్చడానికి అనుమతి లేదని ఎస్ఈసీ తెలిపింది. అలాగే పింఛన్ మొత్తాల్లోనూ ఎలాంటి మార్పులు చేయరాదని సూచించింది. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వ సిబ్బందిని మాత్రమే వినియోగించచుకోవాలని, రాజకీయ నేతలు ఇందులో పాల్గొనరాదని ఎస్ఈసీ తెలిపింది. తమ ఆదేశాలు అతిక్రమిస్తే చర్యలు తీసుంటామని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది.

రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు పాల్గొనకుండా అదేశాలు ఇవ్వాలని విపక్ష వైఎస్సార్సీపీ ఇప్పటికే ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించింది. అలాగే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం తరఫున రాజకీయ నేతలు కాకుండా కేవలం అధికారులు, సిబ్బంది మాత్రమే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని, ఇతరులు పాల్గొంటే చర్యలు తప్పవని ఎస్ఈసీ హెచ్చరికలు చేస్తోంది. వాస్తవానికి ప్రతీ నెలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఇందులో స్వయంగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు విధిగా పాల్గొంటున్నారు. కానీ ఈసారి ఎన్నికల కోడ్ కారణంగా వీరంతా పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉండాల్సి వస్తోంది.













Click it and Unblock the Notifications
