బర్డ్ ఫ్లూ భయం.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. వారికి టెన్షన్!
బర్డ్ ఫ్లూ వైరస్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రజలు చికెన్ వంక చూడాలంటేనే భయపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కానూరులో కోళ్లకు వైరస్ తోకినట్టుగా అధికారులను నిర్ధారించడంతో ఒక్కసారిగా చికెన్ తినేవాళ్లు లేకుండా పోయారు.
ఏపీలో పడిపోయిన చికెన్ ధరలు
ఇప్పటివరకు ఉభయ గోదావరి జిల్లాలలో 50 లక్షల పైగా కోళ్లు మృతి చెందినట్లుగా సమాచారం రావడంతో బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన కోళ్లను తింటే జబ్బు పడతాం అన్న భయంతో ప్రజలు చికెన్ షాప్ లో వంక నే చూడడం లేదు. ఇక అధికారులు కూడా వరుసగా బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడంతో ఏపీలో చికెన్ ధరలు దారుణంగా పడిపోయాయి.

ధర తగ్గినా చికెన్ కొనని ప్రజలు
ఇక బర్డ్ ఫ్లూ వైరస్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చికెన్ కొనుగోలు చేయకుండా చేస్తోంది. నిన్నటి వరకు 210 నుంచి 230 వరకు అమ్మిన కిలో చికెన్ ధర ఈరోజు ఒక్కసారిగా 150 రూపాయలు నుంచి 170 రూపాయలకు పడిపోయింది. ఇంత పెద్ద మొత్తంలో ధర తగ్గినా జనాలు మాత్రం చికెన్ కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు.
ఏపీ సరిహద్దుల్లో కోళ్ళ వాహనాల తనిఖీ... వెనక్కు వాహనాలు
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే కోళ్ల వాహనాలను సరిహద్దులలోనే అడ్డుకుంటున్నారు. ఏపీ నుంచి వచ్చే కోళ్ళ వాహనాలను తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. 24 గంటలు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కోళ్ల వాహనాలు వెళ్లకుండా చూస్తున్నారు.
అక్కడ 30 రూపాయలకే చికెన్.. కోనేవారేరి
ఇక బర్డ్ ఫ్లూ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్న జిల్లాలలో కిలో చికెన్ 30 రూపాయలకే అమ్ముతున్నా ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో పౌల్ట్రీ ల నిర్వహకులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలోని కానూరులో రెడ్ జోన్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పశు సంవర్ధక శాఖ అధికారులు బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో పౌల్ట్రీ నిర్వాహకులను అలర్ట్ చేస్తున్నారు.
పౌల్ట్రీ నిర్వాహకులకు టెన్షన్
ఏది ఏమైనా బర్డ్ ఫ్లూ భయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చికెన్ తినాలంటేనే జనాలు భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకపక్క కొనుగోలు లేకపోవడం, మరోపక్క బర్డ్ ఫ్లూ భయం పౌల్ట్రీ నిర్వాహకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఆర్థికంగా నష్టపోయేలా చేస్తుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications