ఢిల్లీ ఎయిర్ పోర్టులో సజ్జలకు పోలీసుల షాక్- హైదరాబాద్ ఫ్లైట్ మిస్ ..!
ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా సకల శాఖ మంత్రిగా పేరుతెచ్చుకున్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి అధికారం కోల్పోయాక మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల పాత్రపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తుండగా.. ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే తాజాగా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి బదలాయించింది. దీంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో కనిపించిన సజ్జల రామకృష్ణారెడ్డికి పోలీసులు షాకిచ్చారు. ఆయనపై లుక్ అవుట్ నోటీసు ఉందని తెలిపారు. విదేశాలకు ఆయన వెళ్లే అవకాశం లేదని చెప్పారు. దీంతో ఆయన తాను విదేశాలకు వెళ్లడం లేదని , హైదరాబాద్ కు వెళ్తున్నట్లు వారికి వివరించారు. దీంతో ఆయన వెళ్లేందుకు అనుమతించారు. కానీ అప్పటికే ఆయన వెళ్లాల్సిన హైదరాబాద్ ప్లైట్ టేకాఫ్ అయిపోయింది. దీంతో మరో ఫ్లైట్ లో ఆయన హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది.

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సజ్జలతో పాటు వైసీపీ నేతలు దేవినేని అవినాష్, నందిగం సురేశ్,లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురికి గతంలోనే పోలీసులు నోటీసులు పంపారు. వీరిలో నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు కూడా చేశారు. అయితే వీరంతా హైకోర్టులో ముందస్తు బెయిల్ కు పిటిషన్లు వేసినా కొందరికి మాత్రమే ఊరట లభించింది. ఇందులో సజ్జలపైనా కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేయలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications