చంద్రబాబు, లోకేష్ పై కేసులివే- నామినేషన్ల వేళ పోలీసుల ఈ మెయిల్..!
ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నామినేషన్లలో పేర్కొనాల్సిన కేసుల వివరాలను తమకు పోలీసులు ఇవ్వడం లేదంటూ చంద్రబాబు, లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలు గతంలో హైకోర్టును ఆశ్రయించడం, విచారణ తర్వాత వాటిని అందించాలని ఆదేశాలు రావడం జరిగిపోయాయి. అయితే ఇవాళ నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పోలీసులు స్పందించారు.
రాష్ట్రంలో పోలీసులు, సీఐడీ సహా ఇతర దర్యాప్తు సంస్ధలు తమపై నమోదు చేసిన కేసుల వివరాలు ఇవ్వాలంటూ చంద్రబాబు, లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలు చేసిన వినతిపై స్పందించిన పోలీసులు.. వారికి ఈ మెయిల్ లో వివరాలు పంపారు. వీటి ప్రకారం చంద్రబాబు, లోకేష్ ఇద్దరిపై చెరో 23 కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తేలింది. వీటి వివరాలను కూడా పోలీసులు ఈ మెయిల్ లో పంపడంతో వాటిని నామినేషన్లలో పొందుపరిచేందుకు వీరు సిద్ధమవుతున్నారు.

తాజాగా పోలీసులు పంపిన ఈ మెయిల్ ప్రకారం చంద్రబాబుపై సీఐడీ కేసులు 8 ఉన్నాయి. అలాగే లోకేష్ పై ఓ సీఐడీ కేసు ఉంది. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో 15 కేసులు నమోదు చేశారు. అలాగే లోకేష్ యువగళం పాదయాత్రలో పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల వివరాలు ఇవ్వాలని వీరు గత కొంతకాలంగా కోరుతున్నా పోలీసులు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. ఈ వివరాలు తమ వద్ద లేవని కూడా హైకోర్టుకు చెప్పారు. కానీ చివరికి హైకోర్టు ఆదేశాలతో ఇవ్వక తప్పలేదు.












Click it and Unblock the Notifications