వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Tdp Vs Ysrcp: ఆరోప‌ణ‌లు చేస్తే టీడీపీ వాళ్ల ఇంటికెళ్లి గుడ్డ‌లూడ‌దీసి కొడ‌తా???

|
Google Oneindia TeluguNews

రాజ‌కీయాల్లో మాట అనేది చాలా విలువైన‌ది. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మాట్లాడ‌కుండా, ఎప్పుడు ప‌డితే అప్పుడు ఉప‌యోగించ‌కుండా విలువైన సంద‌ర్భాల్లో ఉప‌యోగిస్తే అధికారం సులువుగా ద‌క్కించుకోవ‌చ్చు. కానీ కాలం మారింది.. నేత‌లు మారారు.. ఎవ‌రెవ‌రో నాయ‌కులుగా ఆయా రాజ‌కీయ పార్టీల్లో చ‌లామ‌ణి అవుతున్నారు. పాత త‌రం నేత‌లు అధికారంలో ఉన్నా ఆచితూచి మాట్లాడేవారు.. ప్ర‌తిప‌క్షాల‌పై గౌర‌వంగా వ్య‌వ‌హ‌రించేవారు. కానీ ప్ర‌స్తుత నాయ‌కులు మాత్రం అధికారం చేతిలో ఉందిక‌దా అని ఎలా ప‌డితే అలా మాట్లాడుతున్నారనే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

వైర‌ల్ అవుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి మాట‌లు

వైర‌ల్ అవుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి మాట‌లు


ఉమ్మ‌డి గుంటూరు జిల్లా మాచ‌ర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి మాట్లాడిన మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేత‌లు అన‌వ‌స‌రంగా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, అటువంటివారి ఇంటికి వెళ్లి గుడ్డ‌లూడ‌దీసి కొడ‌తామంటూ హెచ్చ‌రించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులే అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీ‌నివాస్‌

అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీ‌నివాస్‌


అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడి నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి ఆయ‌న‌పై పోటీచేయ‌డానికి ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న దువ్వాడ శ్రీ‌నివాస్ అయితే చాలా దారుణంగా మాట్లాడారు. ఆయ‌న మాట‌లు ప్ర‌స్తుతం బాగా వైర‌ల్ అవుతున్నాయి. వీరిద్ద‌రి మాట‌లు సోష‌ల్ మీడియాలోవైర‌ల్ అవుతుండ‌గానే క‌ర్నూలు మేయ‌ర్ బీవై రామ‌య్య విలేక‌రుల వీపులు వాయ‌గొడ‌తామ‌ని హెచ్చ‌రించారు. ఎండ‌గా ఉంద‌ని ప్ర‌జ‌లు చెట్ల కింద‌కు వెళితే సామాజిక న్యాయ‌భేరి స‌ద‌స్సులో కుర్చీలు ఖాళీగా ఉన్నాయ‌ని రాశార‌ని, అటువంటి ప‌త్రిక‌లు, ఛాన‌ల్స్కు సంబంధించిన‌ జ‌ర్న‌లిస్టుల వీపుల వాయ‌గొడ‌తామ‌న్నారు.

రాజ‌కీయ నాయ‌కుల ప‌ద‌జాలంపై సామాజిక‌వేత్త‌ల ఆందోళ‌న‌

రాజ‌కీయ నాయ‌కుల ప‌ద‌జాలంపై సామాజిక‌వేత్త‌ల ఆందోళ‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ నాయ‌కులు ఉప‌యోగిస్తున్న ప‌ద‌జాలంపై సామాజిక‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మాట చాలా హుందాగా ఉండాల‌ని, అలాగే గౌర‌వంగా ఉండాల‌ని, మ‌నం మాట్లాడే మాట ఎదుటివారికి మ‌న‌పై గౌర‌వం క‌లిగించే విధంగా ఉండాల‌ని, కానీ ఇప్ప‌టి రాజ‌కీయ‌నాయ‌కులు వాడుతున్న బాష వ‌ల్ల భావిత‌రాల‌కు ఏం సందేశం ఇస్తున్నారంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

రాజ‌కీయాలు హుందాగా ఉండాల‌ని, ప్ర‌త్య‌ర్థులుగా పార్టీల వ‌ర‌కే ప‌రిమితం కావాల‌ని, లేదంటే చివ‌ర‌కు శాశ్వ‌త శత్రువులుగా మారిపోతారంటూ ఆందోళ‌న వెలిబుచ్చుతున్నారు. ఇటువంటి మాట‌లు మాట్లాడే నేత‌ల‌ను పార్టీ అధినేత‌లు క‌ట్ట‌డి చేయాల‌ని సూచిస్తున్నారు.

English summary
If allegations are made, will TDP go to their house and knock them down ??? Politicians who say that
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X