అక్టోబర్ 10 తర్వాత ఏపీలో ఏం జరగబోతోంది ? ఇప్పటికే సంకేతాలు..!

కేంద్ర ఎన్నికల సంఘంలో ఎస్ఐఆర్ విషయంలో నెలకొన్న విభేదాలు, మరోవైపు ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంలో మార్పులతో కేంద్రంలో బీజేపీ.. ఎన్నికల్లో అనుచితంగా లబ్ది పొందుతోందన్న ఆరోపణల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం దేశమంతా ఉద్యమిస్తోంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా తాడోపేడో తేల్చుకునేందుకు ఓవైపు విపక్షాలు, మరోవైపు విద్యార్ది సంఘాలు, ఇంకోవైపు కాక్రోచ్ జనతా పార్టీ సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10న ఏం జరగబోతోంది, ఆ తర్వాత ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఏం జరగబోతోందన్న చర్చ జోరుగా సాగుతోంది.

అక్టోబర్ 10న ఢిల్లీ నిరసనలు (Delhi Protests)

గత కొన్నేళ్లుగా బీజేపీ దేశవ్యాప్తంగా వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తోంది. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నా, ఓట్ల చోరీ జరుగుతున్నట్లు ఆధారాలు దొరికినా, విపక్షాలు దీనిపై గళమెత్తుతున్నా ఎన్నికల సంఘం మాత్రం ఎప్పటికప్పుడు కవర్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎస్ఐఆర్ పేరుతో భారీ ఎత్తున జరిగిన ఓట్ల తొలగింపులు, చేరికల వెనుక కేంద్ర ఎన్నికల సంఘం ఉందని, అందులో విభేదాలకూ, వీటితో లింక్ ఉన్నట్లు బయటపెట్టడంతో రేగిన కలకలం ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్య వాదుల్ని మౌనంగా ఉండనీయడం లేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10న ఢిల్లీ వేదికగా సీఈసీ తొలగింపు కోసం భారీ ఆందోళనలకు అందరూ సిద్దమవుతున్నారు.

AP Politics After October 10 Delhi Protest Will YSRCP Join INDIA Bloc What Is TDP s Strategy
సీఈసీ నిర్ణయాల్ని సుప్రీం రద్దు చేస్తుందా ? గతంలో ఇందిర సహా 6 ఎన్నికలపై స్టేలు..!
సీఈసీ నిర్ణయాల్ని సుప్రీం రద్దు చేస్తుందా ? గతంలో ఇందిర సహా 6 ఎన్నికలపై స్టేలు..!

సంకటంలో బీజేపీ మిత్రులు

ఈ ప్రభావం దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలపైనా పడబోతోంది. గతంలో, ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు, అలాగే బయటే ఉంటూ మద్దతిచ్చిన బీజేడీ, వైఎస్సార్సీ వంటి పార్టీలు కూడా తాజా పరిణామాలతో యూటర్న్ తీసుకుంటున్నాయి. మరోవైపు కేంద్రంలో ప్రస్తుతం మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, లోక్ జన్ శక్తి వంటి పార్టీలు కూడా ఈసీలో జరిగిన పరిణామాలపై ఆగ్రహంగా ఉన్నాయి. అలా అని వెంటనే ఎన్డీయేకు గుడ్ బై చెప్పేసే పరిస్దితుల్లో లేవు. అయినా అక్టోబర్ 10 తర్వాత ఆందోళనలు మరింత ఉధృతం అయి దేశవ్యాప్తంగా బీజేపీపై ప్రజాగ్రహం వెల్లువెత్తితే మాత్రం.. ఎన్డీయేకు ఇవి గుడ్ బై చెప్పపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

AP Politics After October 10 Delhi Protest Will YSRCP Join INDIA Bloc What Is TDP s Strategy
మోడీకి మళ్లీ జగన్ ఝలక్..! ఛీఫ్ జస్టిస్ ఉండాల్సిందే..!
మోడీకి మళ్లీ జగన్ ఝలక్..! ఛీఫ్ జస్టిస్ ఉండాల్సిందే..!

ఏపీలో ఏం జరగబోతోంది ? (AP Politics)

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఇన్నాళ్లు అధికారిక, అనధికారిక మిత్రపక్షాలుగా కొనసాగిన టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ వంటి పార్టీలకు ఢిల్లీ పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. పైకి చెప్పకున్నా టీడీపీ, జనసేన వంటి పార్టీలు సైతం ఇవన్నీ ఎక్కడ తమ పుట్టి ముంచుతాయో అన్న ఆందోళనలో ఉన్నాయి. ఇక గత ఎన్నికల్లో ఏపీలో 11 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం పాలైన వైఎస్సార్సీపీ అయితే ఓట్ల చోరీపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఇప్పుడు దాన్ని దాచుకోలేక ఈసీ నియామక చట్టంలో మార్పుల పేరుతో కేంద్రాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకూ డిమాండ్ చేసింది. మరోవైపు గతంలో తమ లాగే బయటే ఉంటూ కేంద్రానికి మద్దతిచ్చిన బీజేడీ తరహాలో ఇండియా కూటమి నిరసనలకు జత కలిసేందుకు వైఎస్సార్సీపీ సిద్దమవుతోంది. అదే జరిగితే టీడీపీ, జనసేనపై ఒత్తిడి అమాంతం పెరుగుతుంది. అప్పటికీ మోడీకి మద్దతిస్తే ఈ రెండు పార్టీలూ ఏపీలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనే ప్రమాదం ఉండటంతో ఎన్డీయేకు గుడ్ బై చెబుతాయా, తృతీయ ఫ్రంట్ ఆలోచనలకు మద్దతిస్తాయా అన్నది చూడాల్సి ఉంది. ఏదేమైనా అక్టోబర్ 10 తర్వాత ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు తప్పేలా లేవు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+