వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు చంద్రబాబు సమీక్ష..! అదికారులతో కాదు.. పార్టీ ఓటమిపై నేతలతో..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

నేడు చంద్రబాబు సమీక్ష..! అదికారులతో కాదు.. పార్టీ ఓటమిపై నేతలతో..!! || Oneindia Telugu

అమరావతి/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమికి గల కారణాలపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడిపి ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ఈ సమావేశంలో చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించనున్నారు. భవిష్యత్తు ప్రణాళికపై పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చంద్రబాబు చేయనున్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ వేదికగా తెలుగుదేశం పార్టీ...ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహిస్తోంది.

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో టీడిపి కార్యకర్తలు, నాయకులపై జరిగిన దాడులను జిల్లాల వారీగా సేకరించనున్నారు. పార్టీ శ్రేణులకు అండగా ఉండేందుకు ఓ టోల్ ఫ్రీ నెంబర్​ను టీడిపి ఏర్పాటుచేసింది. దాడులను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై అధినేత చంద్రబాబు కార్యచరణ రూపొందించనున్నారు.

 ఓటమి బాదించినా భరించక తప్పదు..! ప్రజలకు అండగా ఉండాలని బాబు సూచన..!!

ఓటమి బాదించినా భరించక తప్పదు..! ప్రజలకు అండగా ఉండాలని బాబు సూచన..!!

నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియజేసే వ్యవస్థను శ్రేణులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను ఈ సమావేశంలో విశ్లేషించనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఓటమి లేని స్థానాలు, నియోజకవర్గం ఏర్పడి నాటి నుంచి విజయాలు నమోదు చేసిన సీట్లలలో ఈసారి ఓటమి పాలవ్వడంపై వాస్తవాలేమిటనే కోణంలో అధ్యయనం చేయనున్నారు.జన్మభూమి కమిటీల వ్యవహారం, అభివృద్ధి, సంక్షేమాన్ని కార్యక్రమాల పేరిట ప్రభుత్వం అందించిన లబ్ధిని జన్మభూమి కమిటీల తీరు దెబ్బతీశాయా..తీస్తే 150 స్థానాల్లో ఆ ప్రభావం పడిందా అనే చర్చ సమావేశంలో జరగనుంది.

 పవన్ ఓట్లను చీల్చారు..! ఐదేళ్లు ప్రజల పక్షాన నిలబడదామన్న చంద్రబాబు..!!

పవన్ ఓట్లను చీల్చారు..! ఐదేళ్లు ప్రజల పక్షాన నిలబడదామన్న చంద్రబాబు..!!

ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్​కు పడకుండా పవన్ కల్యాణ్ చీలుస్తాడనుకున్నది విఫలమవటం..జనసేన పోటీ తెలుగుదేశం కంటే వైసీపికే మేలు చేసిందనే అభిప్రాయం నేతలు నుంచి వ్యక్తమవుతున్నా...అది ఎన్ని స్థానాలకు పరిమితమైందో చర్చించనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న బీసీలు... గత అయిదేళ్లలో కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇవ్వటం వల్ల పార్టీకి దూరంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీకి అండగా నిలిచే కొన్ని సామాజిక వర్గాలను పొగొట్టుకున్నామనే భావన నేతల్లో ఉంది. వీటిపై సమీక్షలో సమగ్ర విశ్లేషణ జరగనుంది. పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించిన చంద్రబాబు...ఆ దిశగా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

 అసెంబ్లీలో మాటల యుద్దం..! రెచ్చిపోతున్న రోజా..!!

అసెంబ్లీలో మాటల యుద్దం..! రెచ్చిపోతున్న రోజా..!!

తనను చంద్రబాబు బంట్రోతుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అభివర్ణించడంపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయిన తమ్మినేని సీతారామ్ ను తాను గౌరవంగా కుర్చీవరకూ వచ్చి కూర్చోబెట్టానని గుర్తుచేశారు. ఆ మాటలు అన్నందుకు సభలో క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రికార్డులు చేసి ఆ వ్యాఖ్యలు ఉంటే తొలగిస్తానని అన్నారు. సభాపతి వ్యాఖ్యలపై సంతృప్తి చెందని అచ్చెన్నాయుడు.. తాము ప్రజాప్రతినిధులమా లేక బంట్రోతులమా? అన్నది స్పీకర్ చెప్పాలన్నారు.

 అచ్చెన్నాయుడు ఆరోపణలు..! ముప్పేట దాడికి దిగుతున్న వైసీపి ఎమ్మెల్యేలు..!!

అచ్చెన్నాయుడు ఆరోపణలు..! ముప్పేట దాడికి దిగుతున్న వైసీపి ఎమ్మెల్యేలు..!!

తాము చంద్రబాబుకు బంట్రోతులమైతే వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెలు జగన్‌కు బంట్రోతులని వారు ఒప్పుకుంటే తాము కూడా చంద్రబాబు బంట్రోతులమని ఒప్పుకుంటామని అచ్చెన్నాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. దీంతో చంద్రబాబు మాట్లాడుతూ ఈ విషయాన్ని రాద్దాంతం చేయదలచుకోలేదని, స్పీకరే ఒక నిర్ణయానికి రావాలని కోరారు. దీనిపై సభాపతి మాట్లాడుతూ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రికార్డులు చూసి ఆ వ్యాఖ్యాలను రికార్డుల నుంచి తొలగించి, ఏం చేయాలన్నదానిపై చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు.

English summary
party leaders at the meeting on the Telugu Desam Party cadre in the state after the election results. Chandrababu will be heading to party machinery on future planning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X