దంచికొడుతున్న వాన... ఏపీలో ఆ జిల్లాలలో కంట్రోల్ రూమ్స్, రైతులకు అలెర్ట్!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి . శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ పుడ్కర్ అన్నారు. జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం సేకరణ లో కొంతవరకు జాప్యత ఎదురవుతున్నాయని.. రైతులు ఎటువంటి భయాందోళన చెందనవసరం లేదని కలెక్టర్ అభయమిచ్చారు.

వర్షాలతో రైతులకు అధికారుల సూచనలు
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పండిన వరి పంట నష్టపోకుండా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని తెలిపారు. తడిసి ముద్దయిన.. రంగు మారిన ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. పొలాల్లో ఉన్న వరి పంట సురక్షితంగా ఉండేందుకు టార్పాలిన్స్ సరఫరా చేస్తున్నామని.. అవసరమైన రైతులు సంబంధిత మండల రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు...

AP rain alert rains in these districts Control rooms and alert for farmers

జిల్లాలో గత మూడు రోజులుగా వర్షాలు
నిన్నటికి జిల్లాలో 16.5 మిల్లీ మీటర్లు వర్షం నమోదు అయిందని, ఈ రోజు జిల్లా అంతటా గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుందని చెప్పారు.. శ్రీకాకుళం.. ఎచ్చెర్ల... ఆమదాలవలస... నరసన్నపేట నియోజక వర్గాల పరిధిలో కొంతవరకు వరికోతలు చేసిన ధాన్యం పొలాల్లో ఉందని.. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో రైతులు పండించే ధాన్యాన్ని వరి కుప్పల రూపంలో పొలాల్లో సురక్షితంగా వుంచుకున్నారని చెప్పారు..

లోతట్టు ప్రాంతాల రైతులకు అలెర్ట్
లోతట్టు ప్రాంతాల్లోని రైతులకు కొంత వరకు ఇబ్బందులు ఉన్నాయని.. అట్లాంటి వారి కొరకు జలవనరుల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని తెలిపారు. తుఫాన్ ప్రభావం వల్ల .. దీని కొరకు జాయింట్ కలెక్టర్ సారధ్యంలో ఒక ప్రత్యేక బృందం పనిచేస్తుందని అన్నారు.

విజయనగరం జిల్లాలో వర్షాలు
ఇక విజయనగరం జిల్లాలో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. ధాన్యం త‌డవ‌కుండా త‌గిన ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లను తీసుకోవాల‌ని విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ సూచించారు. నూర్పిళ్లు పూర్త‌యి సిద్దంగా ఉన్న సుమారు 40వేల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని త‌క్ష‌ణ‌మే కొనుగోలు చేయాల‌ని ఆదేశించారు. వ‌ర్షాల కార‌ణంగా జిల్లాలో ఏ ఒక్క రైతుకూ పంట‌ న‌ష్టం వాటిళ్ల‌కుండా చూడాల‌న్నారు.

జిల్లాలో వర్షాల ప్రభావంపై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్
విజయనగరం జిల్లాపై వ‌ర్షాల ప్ర‌భావాన్ని ఆయ‌న త‌మ ఛాంబ‌ర్ నుంచి టెలీకాన్ఫ‌రెన్స్ ద్వారా మండ‌ల ప్ర‌త్యేకాధికారులు, క్షేత్ర‌స్థాయిలో తహసీల్దార్లు, ఇత‌ర మండ‌ల స్థాయి అధికారుల‌తో స‌మీక్షించారు. జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు సుమారుగా 2.27 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం నూర్పిళ్లు పూర్త‌యి సిద్దంకాగా, వీటిలో ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 1.83 ల‌క్ష‌ల ట‌న్నుల‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు.

రేపు కూడా వర్షాలు.. అలెర్ట్
ఇంకా సుమారు 40 వేల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం రైతుల‌వ‌ద్ద కొనుగోలుకు సిద్దంగా ఉంద‌ని, త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకొని ఈ ధాన్యాన్ని వెంట‌నే కొనుగోలు చేయాల‌ని సివిల్ స‌ప్ల‌యిస్ అధికారుల‌ను ఆదేశించారు. జిల్లాలో శ‌నివారం కూడా వ‌ర్షాలు పడే అవ‌కాశం ఉంద‌ని, అన్నివిధాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని క్షేత్ర‌స్థాయి అధికారుల‌ను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+