AP rains: స్వల్పంగా తగ్గిన గోదావరి వరద; కానీ ముంచుకొస్తున్న పెనుప్రమాదం; ఏజెన్సీలో పరిస్థితులిలా!!

అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో పాటు, ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద నీరు పోటెత్తింది. మొన్న భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం ఒకటో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించగా , ప్రస్తుతం గోదావరి ఉధృతి కొద్దిగా తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 39.7 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం మధ్య ప్రస్తుతం ఇన్ ఫ్లో, మరియు అవుట్ ఫ్లో 9.6 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దిగువన శబరి నది పోటు వలన గోదావరి ప్రవాహం నిదానంగా మారింది. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని పరివాహక ప్రాంత ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు చేస్తోంది.

floodofgodavari1

ప్రస్తుత పరిస్థితులను బట్టి భద్రాచలం వద్ద వరద ప్రవాహం తగ్గినప్పటికీ, ధవళేశ్వరం వద్ద వరద కొనసాగే అవకాశం ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నేడు వరద ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదిలా ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ప్రకాశం, అనంతపురం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

కాగా గోదావరి నీటిమట్టం పెరగడంతో పాటు ఇంద్రావతి, సీలేరు, శబరి ఉపనదులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ మండలాలలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. చింతూరు, కూనవరం, కుక్కునూరు, దాచారం ప్రాంతాలలో భారీ వరద నీరు చేరుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతేడాది తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా చింతూరును వరద మంచేసిందని, మళ్ళీ అలా జరుగుతుందా అని ఆందోళనలో ఉన్నారు.

దీంతో అధికారులు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో దీనివల్ల అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం వద్ద గండి పోచమ్మ ఆలయం మునిగిపోయింది. ఆ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+