ఏపీలో వర్షాల విషయంలో తగ్గేదేలే.. తేల్చి చెప్పిన బంగాళాఖాతం

చలికాలం ప్రారంభమవుతున్నప్పటికీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు మాత్రం వదలడం లేదు, త్వరలోనే బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడనున్నాయని, అరేబియా సముద్రంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ద్రోణిగా మారే అవకాశం ఉండడంతో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి ప్రకటించింది.

ఏపీ, తెలంగాణాలలో వర్షాలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రెండు రోజులపాటు ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో ఉదయాన 27డిగ్రీల నుండి 31డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. విశాఖ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కొద్దిగా వర్షం పడే అవకాశం ఉందని తూర్పు నుండి గాలి గంటకు 11నుంచి 14కిలోమీటర్ల వేగంతో వీస్తుందని పేర్కొంది.

ap rains update bay of bengal and arabia sea gave clarity on rains in these districts

ఉత్తర కోస్తాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
ఇక సాయంత్రం ఉష్ణోగ్రత 27 డిగ్రీల నుండి 29 డిగ్రీల మధ్య ఉంటుందని కొన్ని ప్రాంతాలలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరకోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానంలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

దక్షిణ కోస్తా, రాయలసీమలలో వర్షాలు
దక్షిణ కోస్తా ఆంధ్రలో కూడా నేడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఈరోజు రాయలసీమలోనూ ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురియవచ్చునని వాతావరణ శాఖ వెల్లడించింది.

నేడు ఈ జిల్లాలలో మోస్తరు వర్షాలు
ఇక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈరోజు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్సార్, చిత్తూరు, అన్నమయ్య, మరియు తిరుపతి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కనుక వర్షాలు కురిసే జిల్లాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

నేడు ఈ జిల్లాలలో తేలికపాటి వర్షాలు
అంతేకాదు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో నేడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+