ఏపీపై క్యుములోనింబస్ మేఘాలు.. తీవ్ర హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపై క్యుములోనింబస్ మేఘాలు వస్తున్నాయని దీంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అయితే వర్షాలు కురిసిన చోట మాత్రం భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

ఏపీలో అప్పటిదాకా వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాధ్ కూడా వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్న క్రమంలో తాజాగా నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, 14, 15 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ.

AP rains updates moderate rains in ap today Cumulonimbus clouds over AP severe warning

నేడు ఏపీలో ఈ జిల్లాలలో వర్షాలు
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అంతేకాదు విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి మరియు వైయస్సార్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

శాటిలైట్ అంచనాల ప్రకారం నేడు వర్షాలిలా
ఇక శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఈరోజు ఉదయం తూర్పు రాయలసీమ జిల్లాలలో కొన్నిచోట్ల జల్లులు పడుతున్నాయి. కోస్తా మరియు ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉదయం 8 గంటల తర్వాత మోస్తరు వర్షం కురుస్తుంది. ఇక ఉదయం 11 తరువాత ఎక్కడా వాన కురవదని, మళ్లీ రాత్రి 8 గంటల తర్వాత తిరుమల, దక్షిణ రాయలసీమలో జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

వర్షాలు పడే ప్రాంతాల్లో జాగ్రత్త
క్రమంగా ఇవి పెరుగుతూ రాత్రి 10 గంటల తర్వాత దక్షిణ రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని, రాత్రి 12 తర్వాత రాయలసీమ అంతటా వర్షాలు కురుస్తాయని 13వ తేదీ ఉదయం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని శాటిలైట్ లైవ్ అంచనాలు వెల్లడించాయి. ఏది ఏమైనా ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగునున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షాలు కురిసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+