ఏపీలో కరోనా ఉప్పెన: ఒక్కరోజే 2600లకు పైగా: ఆ జిల్లాలో 600లకు పైగా కేసులు
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉప్పెనలా మారాయి. రోజురోజుకూ భయం కలిగించేలా నమోదు అవుతున్నాయి. కరోనా విజృంభణ గంటగంటకూ కొనసాగుతోంది. ఊహకు అందని విధంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీనికితోడుగా మరణాలు కూడా అదే స్థాయిలో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 500 మార్క్‌ను దాటేసింది. 24 గంటల్లో 42 మరణాలు నమోదు అయ్యాయి.

కొత్తగా 2602 కేసులు..
రాష్ట్రంలో కొత్తగా 2602 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 2592 కేసులు వేర్వేరు జిల్లాల్లో నమోదు అయ్యాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వల్ల 10 కేసులు వెలుగులోకి వచ్చాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 20,245 శాంపిళ్లను పరీక్షించారు. కొత్తగా నమోదైన కేసులతో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40,646కు చేరుకుంది. ఇందులో 20,298 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. 534 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 19814గా నమోదైంది.

తూర్పులో 600లకు పైగా
24 గంటల వ్యవధిలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్కరోజే 643 కేసులు వెలుగు చూశాయి. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 300 మార్క్‌ను దాటేశాయి. చిత్తూరు-328, గుంటూరు-367, కర్నూలు-315 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం-297, కడప-55, కృష్ణా-37, నెల్లూరు-127, ప్రకాశం-53, శ్రీకాకుళం-149, విశాఖపట్నం-23, విజయనగరం-89, పశ్చిమ గోదావరి-109 కేసులు నమోదు అయ్యాయి. 600 మార్క్‌ను దాటి పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
Recommended Video

అనంతపురంలో అత్యధిక మరణాలు..
24 గంటల వ్యవధిలో మొత్తం 42 మంది కరోనా వైరస్ వల్ల మృత్యువాత పడినట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. అత్యధిక మరణాలు అనంతపురంలో నమోదు అయ్యాయి. ఈ జిల్లాలో 24 గంటల వ్యవధిలో ఆరుమంది మృతి చెందారు. చిత్తూరు-5, తూర్పు గోదావరి-5, ప్రకాశం-5, గుంటూరు-4, పశ్చిమ గోదావరి-4, కడప-3, విశాఖపట్నం-3, కర్నూలు-2, నెల్లూరు-2, విజయనగరం-2, కృష్ణాలో ఒకరు మృత్యువాత పడ్డారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications