ఏపీలో సంక్రాంతి సందడి మామూలుగా లేదుగా.. ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయంటే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సందడి కనిపిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలలో సంక్రాంతి సందడి కనిపింది చేస్తుంది. ఈ సంవత్సరం పర్యాటక ప్రదేశాలు శిల్పారామాలలో సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా విశాఖపట్టణం, కాకినాడ, తిరుపతి, విజయనగరం, కడప, పులివెందుల, పుట్టపర్తి, అనంతపురం, శిల్పారామాలలో ఈనెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రత్యేకంగా వేడుకలను నిర్వహించనున్నారు.

సంక్రాంతికి భవానీ ఐలాండ్లో సంక్రాంతి ఫెస్ట్
అంతేకాదు సంక్రాంతి సంబరాలకు భవాని ఐలాండ్ అందంగా ముస్తాబయింది. నేటి నుంచి భవాని ఐలాండ్లో సంక్రాంతి ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద నదీ ద్వీపమైన విజయవాడ భవాని ఐలాండ్ లో ఆరు రోజులపాటు అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చక్కనైన పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా భవాని ఐలాండ్ లో సంక్రాంతి ఫస్ట్ వినూత్నంగా కొనసాగనుంది. ఆటపాటలు, సాంస్కృతిక కార్య్యక్రమాలతో అలరించనున్నారు.

సంక్రాంతి సందర్భంగా వినూత్న పోటీలు
చేతివృత్తి కళాకారుల స్టాల్స్ ఏర్పాటు చేసి విభిన్న పోటీలను నిర్వహించనున్నారు. వంటలు పోటీలు, ముగ్గుల పోటీలు, సాంప్రదాయ వస్త్రధారణ, జానపద గీతాలు, డ్రాయింగ్, గాలిపటాల తయారీ పోటీలు నిర్వహించనున్నారు. ఇక సంక్రాంతి సందర్భంగా శిల్పారామాలలో ఏర్పాటు చేసే ప్రత్యేక వేడుకలకు, ప్రత్యేక కార్యక్రమాలను కూడా ప్రదర్శించనున్నారు. సంక్రాంతి లక్ష్మి పేరుతో సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించి బహుమతులు అందించనున్నారు.

పాపికొండలు బోటింగ్ కు క్యూ కడుతున్న జనాలు
సంక్రాంతి సందర్భంగా తెలుగు సంస్కృతికి పట్టం కట్టేలా హరిదాసుల పాటలు, గంగిరెద్దుల ఆటలు, జానపద సాంప్రదాయ కళారీతుల ప్రదర్శనలు కూడా నిర్వహించనున్నారు. నోరూరించే సాంప్రదాయ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించనున్నారు. సంక్రాంతి సందర్భంగా పర్యాటకులు పాపికొండల బోటింగ్ కు క్యూ కడుతున్నారు. పాపికొండలు బోటింగ్ కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు.

ఏపీలో సంక్రాంతి సందడి .. కళకళలాడుతున్న పర్యాటక హోటళ్ళు
పర్యాటకశాఖ హోటళ్ళు, రెస్టారెంట్లు సైతం సంక్రాంతి శోభతో కళకళడుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా భద్రాచలం వైపున పోచవరం, దేవి పట్నం, గండి పోచమ్మ బోటింగ్ పాయింట్ల నుండి 29 బోట్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. పాపికొండల యాత్రకు కూడా ఫుల్ డిమాండ్ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ శిల్పారామం, ఏపీ టి డి సి సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టి చక్కనైన ఏర్పాట్లను చేస్తున్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications