ఏపీలో స్కూల్ విద్యార్థుల ఘర్షణ: విద్యార్థిని కత్తితో పొడిచిన మరో విద్యార్ధి!!
సినిమాల ప్రభావమో, వెబ్ సిరీస్ ల పుణ్యమో తెలియదు కానీ చిన్నపిల్లల్లోనూ నేరప్రవృత్తి రోజురోజుకి పెరిగిపోతుంది. చిన్న చిన్న పిల్లలు ఎవరూ ఊహించని దారుణాలకు పాల్పడటం సభ్యసమాజాన్ని ఆలోచించేలా చేస్తోంది. అన్యం పుణ్యం తెలియని చిన్నారులు తమ బాల్యాన్ని సంతోషంగా గడపాల్సింది పోయి కక్షలతో, కార్పణ్యాలతో నేరాలకు ఒడిగడుతున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులు చిన్నారుల మానసిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
తాజాగా అటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం హై స్కూల్ లో చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి మరొక విద్యార్థిని కత్తితో పొడిచిన ఘటన పాఠశాలలోని విద్యార్థులందరినీ ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఉపాధ్యాయుల సమక్షంలో పరీక్షలు రాస్తున్న సమయంలో పరీక్ష కేంద్రంలోని ఈ ఘటన చోటు చేసుకుంది.

ఒక్కసారిగా విద్యార్థి చాకుతో మరో విద్యార్థిని పొడవడంతో ఆ విద్యార్థి తీవ్ర గాయాల పాలయ్యాడు. విద్యార్థిని పొడిచిన వెంటనే దాడికి పాల్పడిన విద్యార్థి అక్కడి నుండి పారిపోయాడు. ఊహించని పరిణామంతో ఖంగుతిన్న ఉపాధ్యాయులు వెంటనే గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రి లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విద్యార్థికి చికిత్స కొనసాగుతోంది.
ప్రస్తుతం గాయపడిన విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అతనికి ప్రాణహాని లేదని వైద్యులు వెల్లడించారు. అయితే అసలు ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఏంటి? ఎందుకు ఇంతలా ఆ విద్యార్థి చాకుతో బాధిత విద్యార్థిని పొడిచాడు? అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అలాగే పరారీలో ఉన్న విద్యార్థి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. చాకుతో విద్యార్థిని పొడిచిన విద్యార్ధి గురించి సహ విద్యార్థులను పోలీసులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications