ఏపీ జిల్లా, మండల పరిషత్తుల్లో పరోక్ష ఎన్నికలు..! ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల..!

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముగిశాయి. తాజాగా వీటికి సంబంధించిన ఫలితాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (AP SEC)విడుదల చేసింది. అనంతరం ఇప్పుడు ఆయా జిల్లా పరిషత్ లు, మండల పరిషత్తుల్లో పరోక్ష ఎన్నికల నిర్వహణకు వీలుగా షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 19న ఎంపీపీ, 20న జడ్పీపీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రత్యేక సమావేశాల కోసం ఈ నెల 14వ తేదీలోగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు నోటీసులు జారీ చేస్తారు.

ముగ్గురి పోరులో 76 చోట్ల గెలిచిన వైసీపీ..! బయటపడుతున్న షాకింగ్ లెక్కలు..!
ముగ్గురి పోరులో 76 చోట్ల గెలిచిన వైసీపీ..! బయటపడుతున్న షాకింగ్ లెక్కలు..!

ఈ నెల 19, 20 తేదీల్లో వరుసగా జిల్లా పరిషత్, మండల పరిషత్తుల్లో జరిగే ఈ పరోక్ష ఎన్నికలకు ముందు కోఆప్షన్ సభ్యుల్ని ఎన్నుకుంటారు. అనంతరం మధ్యాహ్నం వీటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఛైర్ పర్సన్లు, వైస్ ఛైర్ పర్సన్ల ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల రోజుల ఉదయం 10 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకూ నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు గడువు ఇస్తారు. అనంతరం బరిలో మిగిలిన వారిని చేతులెత్తే పద్దతిలో సభ్యులు ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులు విప్ మేరకే ఓటేయాలి, ధిక్కరిస్తే సభ్యత్వం రద్దవుతుంది. కో-ఆప్షన్ సభ్యులకు మాత్రం మినహాయింపు ఉంటుంది.

AP SEC Announces Schedule for Indirect Elections to Zilla and Mandal Parishad Posts
వైసీపీకి ఛాన్స్ దొరికింది అక్కడే- ఆ రెండు కారణాలు- ఆ ఒక్క పని చేసుంటే..?
వైసీపీకి ఛాన్స్ దొరికింది అక్కడే- ఆ రెండు కారణాలు- ఆ ఒక్క పని చేసుంటే..?

ఏదైనా కారణాలతో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగపోతే .. అక్కడ జరగాల్సిన అధ్యక్షులు, ఛైర్ పర్సన్ల ఎన్నికల సమావేశం రద్దు చేస్తారు. తర్వాత రోజు మధ్యాహ్నం 3 గంటలకు దీన్ని నిర్వహిస్తారు. ఈ ఎన్నికల సమావేశానికి స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం పంపుతారు. అలాగే రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో తమ విప్ గా ఉండే వారి వివరాలు ముందు రోజే ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి. ఈ ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. సీసీటీవీ కెమెరాలు, వీడియో రికార్డింగ్ లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

పవన్ విడాకుల వ్యవహారం..! క్యాడర్ కు టీడీపీ, వైసీపీ కీలక ఆదేశాలు?
పవన్ విడాకుల వ్యవహారం..! క్యాడర్ కు టీడీపీ, వైసీపీ కీలక ఆదేశాలు?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+