జగన్ సర్కార్‌పై గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు-సజ్జలను తప్పించండి- కోర్టు కెళతానంటూ
ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా సాగుతున్న జగన్ సర్కార్ వర్సెస్ నిమ్మగడ్డ పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సాగిస్తున్న తనపై మంత్రులు, ప్రభుత్వ పెద్దలు, సలహాదారులు చేస్తున్న విమర్శలపై నిమ్మగడ్డ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధంగా తన పని తాను చేసుకుపోతుంటే ప్రభుత్వ పెద్దలు తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించాలని ఫిర్యాదు చేశారు. అంతేకాదు సర్కారు పెద్దల తీరుపై కోర్టును ఆశ్రయిస్తానన్నారు.

సర్కారు తీరుపై నిమ్మగడ్డ సీరియస్
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం తనకు సహకరిస్తున్నట్లు నటిస్తూనే మరోవైపు కత్తులు దూస్తున్న వ్యవహారంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆగ్రహంగా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అధికారులు సహకరిస్తున్నట్లు కనిపిస్తున్నా.. అంతర్గంతగా తన ఆదేశాలేవీ పాటించకపోవడం, మంత్రులు, సలహాదారులు తనపై రోజూ బహిరంగ విమర్శలకు దిగుతుండటంపై నిమ్మగడ్డ సీరియస్ అయ్యారు. దీంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా వీటికి అడ్డుకట్ట వేసేందుకు నిమ్మగడ్డ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గవర్నర్ హరిచందన్‌కు ఆయన ఇవాళ ఓ లేఖ రాశారు.

సజ్జలను తప్పించాలని గవర్నర్‌కు లేఖ
పంచాయతీ ఎన్నికల విషయంలో తనను రోజూ టార్గెట్ చేస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. సజ్జల ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ పార్టీ ఆఫీసు నుంచి తనపై విమర్శలు చేస్తున్నారని గవర్నర్‌కు రాసిన లేఖలో ఎస్‌ఈసీ ఆరోపించారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమని నిమ్మగడ్డ తెలిపారు.
సుప్రీంకోర్టులో కేవియట్ వేసిన తనకు వ్యతిరేకంగా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయని గవర్నర్‌కు నిమ్మగడ్డ గుర్తుచేశారు. సజ్జల వ్యాఖ్యలపై తదుపరి చర్యలకు అటార్నీ జనరల్ సలహా తీసుకోవాలని గవర్నర్‌ను ఆయన కోరారు.

మంత్రుల విమర్శలు కోడ్ ఉల్లంఘనే
ఏపీలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఏకంగా ఎన్నికలు నిర్వహిస్తున్న తనపైనే నిత్యం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తప్పుబట్టారు. మంత్రుల విమర్శలు కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయని గవర్నర్‌కు తెలిపారు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స లక్ష్మణరేఖ దాటి తనపై విమర్శలు చేస్తున్నారని గవర్నర్‌కు చేసిన ఫిర్యాదులో నిమ్మగడ్డ పేర్కొన్నారు. మంత్రుల విమర్శలపై గవర్నర్ తగు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.

సర్కారు విమర్శల దాడిపై కోర్టుకెళతానన్న నిమ్మగడ్డ
ప్రభుత్వంలో భాగంగా ఉన్న మంత్రులు, సలహాదారులు తనపై ఉద్దేశపూర్వంకంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని గవర్నర్‌కు చేసిన ఫిర్యాదులో నిమ్మగడ్డ పేర్కొన్నారు. వీటిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వ పదవిలో ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్న సజ్జల రామకృష్ణారెడ్డిపై న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్లాలని గవర్నర్‌కు నిమ్మగడ్డ సూచించారు. అయితే
సజ్జలపై చర్యల విషయంలో అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రహ్మణ్యంపై తనకు నమ్మకం లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తెలిపారు. అందుకే
అటార్నీ జనరల్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. అదే సమయంలో ప్రభుత్వం తనపై చేస్తున్న విమర్శల దాడిపై కోర్టును ఆశ్రయిస్తానని గవర్నర్‌కు నిమ్మగడ్డ తెలిపారు. అంతకంటే ముందే మీ దృష్టికి ఈ విషయాలు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్












Click it and Unblock the Notifications