ఆంధ్రప్రదేశ్‌లో 25 సెక్టోరల్ పార్కులు.. రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు..ఉద్యోగాల టార్గెట్ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా 25 రకాల సెక్టోరల్ పార్కులు ఏర్పాటు చేసి సుమారు రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని నిర్ణయించింది. ఈ పార్కుల ద్వారా దాదాపు 4.47 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆశిస్తోంది. కొన్ని పార్కుల ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు మొదలయ్యాయి, మిగిలిన వాటికి అవసరమైన భూముల సేకరణ.

శ్రీకాకుళం జిల్లా మూలపేటలో నిర్మాణంలో ఉన్న పోర్టుకు అనుసంధానంగా 2,050 ఎకరాల్లో రూ.6,200 కోట్లతో కెమికల్ పార్కు రాబోతోంది. ఇక్కడ కెమికల్, ప్రాసెస్ ఇంజినీర్లు, ప్లాంట్ ఆపరేటర్లు, ల్యాబ్ కెమిస్ట్‌లు, ఫైర్ సేఫ్టీ అధికారులు సహా 21,500 మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. విశాఖపట్నం నడుపూరు వద్ద 405 ఎకరాల్లో రూ.3 వేల కోట్లతో మెడ్‌టెక్ పార్కు ఏర్పాటవుతోంది. బయోమెడికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్లు, క్లీన్ రూమ్ టెక్నీషియన్లు సహా 9 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

AP Sectoral Parks AndhraPradesh to Set Up 25 Sectoral Parks Eyes Rs 4 Lakh Crore Investment and 4 47 Lakh Jobs

ఇక కాకినాడ సెజ్‌లో 1,000 ఎకరాల్లో రూ.25 వేల కోట్లతో ఆయిల్ అండ్ గ్యాస్ తయారీ పార్కు రాబోతోంది. ఇక్కడ 11,800 మందికి ఉపాధి అవకాశం ఉంటుంది. పల్నాడు జిల్లాలో లింగాపురం వద్ద 252 ఎకరాల్లో రూ.2,417 కోట్లతో క్వాంటమ్ కంప్యూటింగ్ పార్కు నిర్మించనున్నారు. దక్షిణాసియాలో మొదటి ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ ఇక్కడే రాబోతోందని చెబుతున్నారు. వెల్దుర్తి వద్ద 500 ఎకరాల్లో రూ.2,500 కోట్లతో మెగా టెక్స్‌టైల్ పార్కు కూడా వస్తోంది. ఇక్కడ 28,700 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

ప్రకాశం జిల్లా కుందూరు వద్ద 1,037 ఎకరాల్లో రూ.8 వేల కోట్లతో సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ పార్కు ఏర్పాటవుతోంది. కర్నూలు ఓర్వకల్లులో 600 ఎకరాల్లో రూ.2,540 కోట్లతో డ్రోన్ సిటీ నిర్మించనున్నారు. ఏరోనాటికల్ ఇంజినీర్లు, డ్రోన్ పైలట్లు, ఏఐ డెవలపర్లు సహా 7,640 మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది.అనకాపల్లి జిల్లాలో మరిన్ని పెద్ద ప్రాజెక్టులు రాబోతున్నాయి.

కె.కోటపాడు సమీపంలో స్టీల్ డౌన్‌స్ట్రీమ్ పార్కు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, మాకవరపాలెంలో ఆర్గానిక్ ఫుడ్ పార్కు, టాయ్ పార్కు, రేర్ ఎర్త్ అండ్ క్రిటికల్ మినరల్ పార్కు వంటివి ఏర్పాటవుతున్నాయి. అలాగే రూ.2.15 లక్షల కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా పార్కు కూడా రాబోతోంది. ఈ పార్కుల ద్వారా వేలాది మందికి ఉపాధి కలుగుతుంది.శ్రీసత్యసాయి జిల్లాలో రోబోటిక్స్ అండ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ పార్కు, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్కు రాబోతున్నాయి.

కడపలో ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ ఏర్పాటు చేస్తే లక్ష మందికి ఉపాధి అవకాశం ఉంటుందని అంచనా. తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీ, కొరియన్ ఇండస్ట్రియల్ పార్కు, సెమీకండక్టర్ పార్కు, నిర్మాణ పరికరాల పార్కు వంటివి రాబోతున్నాయి. నెల్లూరులో స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫర్నిచర్, పెట్రోకెమికల్, అమ్యునేషన్ పార్కులు ఏర్పాటవుతున్నాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, మార్కాపురం, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో ఉద్యాన పంటల పార్కులు కూడా రాబోతున్నాయి.

ఈ పార్కులు కేవలం ఉపాధి కల్పనే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అవకాశం ఉంది. సెమీకండక్టర్లు, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్, ఏరోస్పేస్ వంటి అధునాతన రంగాల్లో పెట్టుబడులు రావడం వల్ల స్థానిక యువతకు కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం కలుగుతుంది. అయితే భూమి సేకరణ, మౌలిక వసతుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు సకాలంలో పూర్తయితేనే ఈ లక్ష్యాలు సాధ్యమవుతాయి.

పెన్షన్ లబ్దిదారులకు తీపికబురు: పెన్షన్ రూ.4000కు పెంచే యోచన!
పెన్షన్ లబ్దిదారులకు తీపికబురు: పెన్షన్ రూ.4000కు పెంచే యోచన!

ప్రభుత్వం ఇప్పటికే కొన్ని పార్కులకు సంబంధించి భూమి సేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది.మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పటంలో పెద్ద మార్పు రాబోతోంది. వివిధ జిల్లాల్లో వివిధ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రాంతీయ అభివృద్ధి సమతుల్యంగా జరగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులు సకాలంలో పూర్తయితే రాష్ట్రం పారిశ్రామిక హబ్‌గా మారే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+