ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పు-ఆ రోజు పరీక్ష..!
ఏపీలో పదో తరగతి పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పు చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన విధంగా ఓ పరీక్ష తేదీన సదరు పరీక్ష నిర్వహించకుండా మరో రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు అభ్యర్ధులు మార్పును గమనించాలని పరీక్షల విభాగం తెలిపింది. ఈ మార్పుకు కారణం రంజాన్ పండుగని తెలిపింది. ఏప్రిల్ 1న పరీక్షలు ముగియగానే ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి మూల్యాంకనం ప్రారంభిస్తారు.
ఈ నెల 31న రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అదే రోజు పదో తరగతి సోషల్ పరీక్ష ఉంది. దీంతో రంజాన్ పండుగ సెలవును దృష్టిలో ఉంచుకుని మార్చి 31న జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 1కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు మినహా మిగతా పరీక్షలన్నీ యథావిథిగా జరగనున్నాయి. మరోవైపు నిన్న జరిగిన సైన్స్ జీవశాస్త్రం పరీక్షలో చిత్తూరు జిల్లాలో ఓ విద్యార్ధిని మాస్ కాపీయింగ్ చేయడంతో డిబార్ చేశారు.

మరోవైపు ఏప్రిల్ 1న టెన్త్ పరీక్షలు ముగియగానే జవాబు పత్రాల మూల్యాంకనం చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఏప్రిల్ 3 నంచి టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. రోజుకు 40 పేపర్ల చొప్పున ఒక్కో టీచర్ జవాబు పత్రాలు మూల్యాంకనం చేయబోతున్నారు. అనంతరం ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి పదో తరగతి పరీక్షల ఫలితాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ మేరకు ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.












Click it and Unblock the Notifications