రేవంత్, అల్లు అర్జున్ కు ఏపీ టీడీపీ ఛీఫ్ కీలక సూచన..! బెనిఫిట్ షోలు లేకపోతే పైరసీ..
టాలీవుడ్ చిత్రం పుష్ప2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో చోటు చేసుకున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇకపై సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని తేల్చిచెప్పేసింది. ఇకపై సినిమాల టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా అనుమతి ఇవ్వబోమంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పేశారు. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ ఛీఫ్ పల్లా శ్రీనివాస్ స్పందించారు.
ఇకపై సినిమాలకు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకూడదన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై స్పందిస్తూ.. బెనిఫిట్ షోలు వేయకూడదు అనే దానికి తాను వ్యతిరేకమని ఏపీ టీడీపీ ఛీఫ్ పల్లాశ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే సినిమా పైరసీ పెరిగిపోతుందని అందుచేత బెనిఫిట్ షోలు వేయాల్సిందేనని పల్లా తెలిపారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. పుష్ప1 హిట్ తర్వాత పుష్ప2పైనా భారీ అంచనాలు నెలకొన్నాయన్నారు.

థియేటర్ల వద్దకు భారీ సంఖ్యలో జనం వస్తారు కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సిందేనని పల్లా తెలిపారు. అలాగే దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత టాలీవుడ్ పైనా, ప్రభుత్వంపైనా ఉందన్నారు. పరస్పర ఆరోపణలు చేసుకోకుండా ఇకపై ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ లకు ఆయన సూచించారు. సినిమా విడుదలైనప్పుడు హీరోలు వెళ్తే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు వెళ్లకపోవడమే మంచిదన్నారు. ఏపీకి సినీ పరిశ్రమ వస్తే స్వాగతిస్తామన్నారు.












Click it and Unblock the Notifications