దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణాలలో భారీ వర్ష సూచన!

ఎల్ నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కురవాల్సిన వర్షాలు కురవలేదు.కానీ ఊహించని విధంగా అప్పుడప్పుడు బంగాళాఖాతంలో అల్ప పీడనాల ప్రభావం, తుఫాన్ల ప్రభావం ఏపీ,తెలంగాణా రాష్ట్రాల మీద పడుతుంది. తాజాగా మళ్ళీ బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఉత్తర అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత 3 నుంచి 4 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు పయనించవచ్చని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గాలుల తీవ్రత పెరిగి, మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

AP Telangana rains Fresh Low Pressure Forming over Southeast Bay of Bengal - Heavy Rains Likely in AP and telangana

కొన్ని అంతర్జాతీయ, జాతీయ వాతావరణ మోడల్స్ ప్రకారం ఈ అల్పపీడనం బుధవారం నాటికి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. మరికొన్ని మోడల్స్ మాత్రం ఇది సాధారణ అల్పపీడనంగానే తీరం వైపు కొనసాగుతుందని అంచనా వేస్తున్నాయి. ఖచ్చితమైన తీవ్రత, కదిలే మార్గంపై రాబోయే 24 నుంచి 48 గంటల్లో మరింత స్పష్టత రావచ్చని అధికారులు చెబుతున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. తీరప్రాంత ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు వాతావరణ హెచ్చరికలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. అల్పపీడనం బలపడే కొద్దీ సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో వేటకు వెళ్లేవారు అనవసర ప్రమాదాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

బతుకమ్మ సంబరాలకు వేళాయే.. ఏ రోజు ఏ పేరు, ఏ నైవేద్యాలు.. తెలుసుకోండి!
బతుకమ్మ సంబరాలకు వేళాయే.. ఏ రోజు ఏ పేరు, ఏ నైవేద్యాలు.. తెలుసుకోండి!

తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాలు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ వంటి జిల్లాల్లో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తా జిల్లాల్లో గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. మొత్తంగా చూస్తే, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడబోయే ఈ అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిపించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+