టీడీపీ నేతల చేతుల్లోనే అమరావతి భూములు-అందుకే త్రీ క్యాపిటల్స్- అసెంబ్లీలో బుగ్గన

ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు వాడీవేడిగా ప్రారంభమైంది. ఉదయం ప్రశ్నోత్తరాల సమయం తర్వాత మధ్యాహ్నం అభివృద్ధి వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఇందులో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మరోసారి మూడు రాజధానుల ఆవశ్యకతపై కీలక ప్రసంగం చేశారు. అమరావతిలో రాజధాని కేంద్రీకృతం కావడం వల్ల జరిగే నష్టాల్ని మరోసారి ఏకరువు పెట్టారు.

గతంలో శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనబెట్టి చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని ఎలాతెరపైకి తెచ్చిందో మొదలుపెట్టి అక్కడి నుంచి చోటు చేసుకున్న పరిణామాల్ని ఒక్కొక్కటిగా వెల్లడించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఇందులో టీడీపీ నేతలు అనుచిత లబ్ది పొందారని బుగ్గన తెలిపారు. అమరావతి ప్రాంతంలో పయ్యావుల కేశవ్, పరిటాల శ్రీరామ్, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి వంటి నేతలు భారీగా భూములు కొన్నారని, హెరిటేజ్ ఫుడ్స్ కూడా ఇందులో ఉందని బుగ్గన ఆరోపించారు. అమరావతిలో వేల ఎకరాల భూములు కొందరి చేతుల్లోనే ఉన్నాయన్నారు.

ap three capitals due to tdp leaders grab amaravati lands-minister buggana key comments

టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్ మెంట్ పార్టీ అని, అమరావతిలో చేపట్టినవి కూడా తాత్కాలిక నిర్మాణాలేనని బుగ్గన అన్నారు. అమరావతిలో టీడీపీ నేతలు దళితుల్ని బెదిరించి వారి అసైన్డ్ భూములు లాక్కొన్నారని బుగ్గన ఆరోపించారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ లో భాగంగా రాజధాని రాకముందే అక్కడ టీడీపీ నేతలు ముందస్తు సమాచారంతో భూములు కొన్నారని బుగ్గన తెలిపారు.

అందుకే తాము అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు బుగ్గన తెలిపారు. గతంలో రియల్ ఎస్టేట్ కోసం టీడీపీ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టిందని, దీంతో తాము మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా అప్పటి తప్పిదాల్ని సరిచేస్తున్నట్లు బుగ్గన వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+