రెండేళ్ళపాటు రూ.50వేల వడ్డీలేని రుణం.. మంత్రి ప్రకటనతో ఏపీలో వారికి తీపికబురు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు బాసటగా నిలుస్తుంది. ఈ క్రమంలో తాజాగా పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా పలు సంక్షేమ చర్యలు ప్రకటించారు. ప్రతి పొగాకు రైతుకు రూ.50 వేల చొప్పున రెండేళ్ల కాలపరిమితితో వడ్డీ లేని రుణం అందజేయాలని అధికారులను ఆదేశించారు.
పొగాకు రైతులకు రూ.1,000 చొప్పున ప్రత్యేక ప్రోత్సాహకం
మార్కెట్లో ధరలు లేక ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులను ఆదుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ధరల నష్టాన్ని పూడ్చడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో కిలో పొగాకు అదనంగా 20 రూపాయలు చొప్పున క్వింటాళ్లకు 1000 రూపాయలను చెల్లించాలని నిర్ణయించారు . అదనంగా క్వింటా పొగాకుకు రూ.1,000 చొప్పున ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వటం పొగాకు రైతులకు కాస్త ఊరట.

9 రోజులలోపే ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ
మార్కెట్‌లో కొనుగోళ్లు పూర్తయిన 9 రోజులలోపే ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వివరించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా రైతులకు త్వరగా ఆర్థిక సాయం అందేలా చూస్తున్నామన్నారు. మార్కెట్ సమతుల్యత, గిట్టుబాటు ధరలు కాపాడే ఉద్దేశంతో వచ్చే ఏడాది పొగాకు సాగును 80 మిలియన్ కిలోలకు పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రైతులకు ప్రభుత్వం అండగా ఉందన్న మంత్రి
ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుండగా ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని ప్రయత్నిస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.ఈ చర్యలు పొగాకు రైతులకు ఆర్థిక ఊరట కలిగించి, వారి సమస్యలు తగ్గించే దిశగా ఉన్నాయని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయన్నారు. రైతులు ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకుని సాగును కొనసాగించాలని మంత్రి సూచించారు.
ధరల నిర్ణయం ఇలా , నాణ్యత నిర్ధారణ కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ
అంతేకాదు బ్రైట్ గ్రేడ్ పొగాకు కిలో 250 రూపాయలు, మీడియం గ్రేడ్ 190 రూపాయలు, లో గ్రేడ్ 110 రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇతర చర్యలలో భాగంగా నాణ్యత నిర్ధారణ కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు, కొనుగోలు చేసిన తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్టు వెల్లడించారు.



Click it and Unblock the Notifications