ఉచిత బస్సు సక్సెస్ తో వైసీపీకి కడుపుమంట..! మంత్రి మండిపల్లి ఫైర్..!
ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని తాజాగా అమల్లోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. అయితే ఈ పథకంలో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లపై వైసీపీ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తోంది. వీడియోలు కూడా షేర్ చేస్తోంది. దీనిపై రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదని, బాధ్యతని రవాణామంత్రి మండిపల్లి తెలిపారు. ప్రజలు ఆనందించే ప్రతీ పథకాన్ని అవహేళన చేయటమే వైసీపీ పనిగా పెట్టుకుందన్నారు. దిగ్విజయంగా అమలవుతున్న స్త్రీ శక్తి పథకాన్ని చూసి కడుపుమంటతో ఓర్వలేకపోతోందన్నారు. ఆధార్, పాన్, ఓటర్ కార్డుల లాంటివి జిరాక్సులు, సాఫ్ట్ కాపీలు కూడా అనుమతిస్తున్నామని ఆయన తెలిపారు.

ఘాట్ రోడ్లలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నని రవాణామంత్రి వెల్లడించారు. స్త్రీ శక్తి పథకం దిగ్విజయంగా అమలు కావడం వైసీపీ వారికి నచ్చడం లేదన్నారు. లక్షలాది మంది అక్క, చెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధి చేకూరుతుందని గుర్తుచేసారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలులో వైసీపీ నాయకులు సలహాలు, సూచనలు ఇవ్వాలి కానీ, అక్కసుతో ప్రవర్తించడం పట్ల ప్రజలు హర్షించరని, ఇది సమంజసం కాదని వైసీపీకి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హితవు పలికారు.












Click it and Unblock the Notifications