జగన్ ధిక్కారం: హెలికాప్టర్‌ ఇస్తాం, వెళ్లి చూడండి -సీమ ఎత్తిపోతలపై తొలిసారి ఎన్జీటీకి కేసీఆర్ సర్కార్

కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతోన్న రగడ రోజుకో మలుపు తిరుగుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు వద్ద తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడంతో మొదలైన పంచాయితీ తొలుత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు, ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ)కి చేరింది. కృష్ణా బోర్డు ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని దుమ్మెత్తిపోసిన తెలంగాణ.. ఎన్జీటీకి చేసిన ఫిర్యాదులో ఏపీ సర్కారు ధిక్కారాలకు పాల్పడిందని ఫిర్యాదు చేయడం గమనార్హం.

జగన్ ధిక్కారం-ఎన్జీటీకి కేసీఆర్

జగన్ ధిక్కారం-ఎన్జీటీకి కేసీఆర్

ఏపీలో జగన్ సర్కారు నిర్మిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ, దానిని వెంటనే నిలిపేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ లో పిటిషన్ వేసింది. సీమ ఎత్తిపోతలకు సంబంధించి ఎన్జీటీ చెన్నై బెంచ్ గతంలో ఇచ్చిన ఆదేశాలను జగన్ సర్కారు ధిక్కరించిందని కూడా తెలంగాణ ఆరోపించింది. అంతేకాదు,

తెలంగాణ సర్కార్ తొలిసారి

తెలంగాణ సర్కార్ తొలిసారి


రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అక్రమమంటూ మహబూబ్ నగర్ జిల్లా రైతులు చాలా కాలంగా పోరాడుతుండటం, తెలంగాణ కాంగ్రెస్ సహా పలు స్థానిక పార్టీలు ఆ పోరాటానికి మద్దతు ఇవ్వడం, రైతులు నేరుగా ఎన్జీటీలో పిటిషన్ వేసి, ఏపీ సర్కారుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం గతంలోనే జరిగినప్పటికీ కేసీఆర్ సర్కారు గమ్మున ఉండిపోయింది. నాడు జగన్ తో దోస్తీ దృష్ట్యా బేసిన్లు, భేషజాలు లేవన్న కేసీఆర్, ఇప్పుడు మారిన పరిస్థితుల నడుమ సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తొలి సారి గ్రీన్ ట్రిబ్యూనల్ మెట్లెక్కారు. పిటిషన్ లో..

హెలికాప్టర్ ఇస్తాం.. మీరే చూసిరండి..

హెలికాప్టర్ ఇస్తాం.. మీరే చూసిరండి..

సీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కారుపై ధిక్క‌ర‌ణ పిటిష‌న్‌ను దాఖలు చేసిన తెలంగాణ సర్కారు.. సదరు ప్రాజెక్టుకు ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌, జ‌ల‌శ‌క్తి శాఖ‌, కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డు నుంచి స‌రైన అనుమ‌తులు కూడా లేవని పేర్కొంది. అక్రమంగా నిర్మిస్తోన్న ఈ ఎత్తిపోత‌ల ప‌నుల‌ను ఎన్జీటీ బృందం స్వయంగా సంద‌ర్శించాల‌ని కోరిన తెలంగాణ ప్రభుత్వం.. ఎన్జీటీ బృందానికి హెలికాప్ట‌ర్, వాహ‌నాలు కూడా స‌మ‌కూరుస్తామ‌ని తెలిపింది. మరోవైపు, కృష్ణా రివర్ బోర్డుకు సైతం కేసీఆర్ సర్కారు ఘాటు లేఖ రాసింది. ఏపీ ఫిర్యాదుల ఆధారంగా మాత్రమే ఈనెల 9న త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టింది. తెలంగాణ ఫిర్యాదులను కూడా చేర్చి మరోసారి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+