నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాయం చేయలేక హెలికాప్టర్లు వెనక్కి, మోడీ చెవిలో వెంకయ్య: తెగిన నేషనల్ హైవే (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుంభవృష్టికి ఊళ్లు ఏరులయ్యాయి. రహదారులు కొట్టుకుపోయాయి. వర్షాల వల్ల రాష్ట్రంలో ఇప్పటికి 13 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. నాలుగు లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది.

రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బుధవారం కూడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారి కొట్టుకుపోయింది.

ఏపీలో వర్షం, జాతీయ రహదారులు కొట్టుకు పోయిన విషయమై వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకు వెళ్లారు. తాము సహకరిస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. గూడురు సహా పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాను ఆనుకుని ఉన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతోంది.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

దీని ప్రభావం వల్ల కోస్తా అంతటా సోమవారం రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

మరో 24 గంటలు కొనసాగే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మంగళవారం రాత్రి తెలిపింది. కోస్తా అంతటా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

 భారీ వర్షాలు

భారీ వర్షాలు

భారీ వర్షాల కారణంగా గూడూరు - చెన్నై రైలు మార్గంలో పలు ప్రాంతాల్లో రైలు వంతెనపై ప్రమాదకర స్థితిలో వరద నీరు చేరుతుండటంతో ఆ మార్గంలో తిరిగే పలు రైళ్లను మంగళవారం పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. అత్యధిక రైళ్లను దారి మళ్లించారు.

 భారీ వర్షాలు

భారీ వర్షాలు

ఎస్పీఎస్ నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, తమిళనాడులోని చెన్నై చుట్టపక్కల ప్రాంతాలు వర్షాలకు చిగురుటాకుల్లా వణకుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. చాలా కోట్ల ఇంకా వర్షం కొనసాగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

 భారీ వర్షాలు

భారీ వర్షాలు

ఏపీలో దాదాపు 200 చెరువులకు గట్లు తెగాయి. జాతీయ రహదారి సహా 950 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయాయి.

 భారీ వర్షాలు

భారీ వర్షాలు

వేల కొద్దీ బస్సులు, లారీలు, ఇతర వాహనాలు రోడ్లపైనే ఆగిపోయాయి. అందులో ప్రయాణికులు తిరిగి వెళ్లలేక, గమ్యస్థానం చేరలేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. చాలామందికి భోజనం, నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు.

 భారీ వర్షాలు

భారీ వర్షాలు

దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. ముంపు ప్రాంతాలు, వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగాయి.

 భారీ వర్షాలు

భారీ వర్షాలు

వర్షం కురుస్తూనే ఉండటం, వరద పెరగడంతో చాలా చోట్ల సహాయ కార్యక్రమాలూ చేపట్టలేని పరిస్థితి. వర్షాల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున సీఎం చంద్రబాబు పరిహారం ప్రకటించారు.

 ప్రధానికి చెప్పిన వెంకయ్య

ప్రధానికి చెప్పిన వెంకయ్య

చెన్నై నుంచి ఏపీ, ఇతర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. చాలా వాటిని దారిమళ్లించారు. ఏపీలో భారీ వర్షాలకు కలిగిన నష్టాలపై ప్రధాని మోడీకి కూడా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు వివరించారు.

 ప్రధానికి చెప్పిన వెంకయ్య

ప్రధానికి చెప్పిన వెంకయ్య

ప్రధానితో ఫోన్‌లో మాట్లాడిన వెంకయ్య నెల్లూరు, చిత్తూరు, కడప, ఉభయగోదావరి జిల్లాల్లో వర్ష బీభత్సం, పంటనష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

 ప్రధానికి చెప్పిన వెంకయ్య

ప్రధానికి చెప్పిన వెంకయ్య

కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీలతోనూ వెంకయ్య వర్షాలపై చర్చించారు.

 భారీ వర్షాలు

భారీ వర్షాలు

వర్షాల వల్ల 23 రైళ్లను రద్దు చేయగా. మరికొన్నింటికి గమ్యస్థానాలను కుదించడం, ఇంకొన్ని రైళ్లను మళ్లింపు మార్గంలో నడుపుతున్నారు.

 భారీ వర్షాలు

భారీ వర్షాలు

విజయవాడ మీదుగా వచ్చే రైళ్లతో పాటు భువనేశ్వర్‌ మీదుగా విశాఖ వచ్చే రైళ్లు సైతం మంగళవారం గంటల తరబడి ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.

బోసిబోయిన చెన్నై - కోల్‌కతా రహదారి

బోసిబోయిన చెన్నై - కోల్‌కతా రహదారి

వేలాది వాహనాలు తిరిగే చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారి బోసిపోయింది. తాజా వర్షాలతో రెండు ప్రాంతాల్లో తెగిపోయింది.

బోసిబోయిన చెన్నై - కోల్‌కతా రహదారి

బోసిబోయిన చెన్నై - కోల్‌కతా రహదారి

మరో ప్రాంతంలో వరద నీరు చేరడంతో వాహనాలు తిరిగేందుకు ఆటంకం కలిగింది. దీంతో చెన్నై- నెల్లూరు మధ్య పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. నెల్లూరు - తిరుపతిమధ్య రవాణా స్తంభించింది.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

వరద ప్రవాహంతో జాతీయ రహదారి దెబ్బతినడం ఇదే మొదటిసారి అని స్థానికులు చెబుతున్నారు. 16వ నెంబరు జాతీయ రహదారికి గండ్లు పడ్డాయి.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

అర్ధరాత్రి బస్సులు నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ, విశాఖల నుంచి చెన్నై, బెంగళూరు, తిరుపతి వెళ్లే అన్ని బస్సులు నిలిచిపోయాయి. నెల్లూరు వరకే నడిచాయి.

ఆహారం లేక ఇబ్బందులు

ఆహారం లేక ఇబ్బందులు

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని కొలనుకుదురు గ్రామంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో గ్రామస్తులు మేడల పైకి చేరారు. ఆహారం, నీరు లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడ్డారు.

వెనుదిరిగిన హెలికాప్టర్లు

వెనుదిరిగిన హెలికాప్టర్లు

నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాఠశాలలన్నింటికీ రేపు కూడా సెలవు ప్రకటించారు. కాగా, నెల్లూరులో సహాయక చర్యలు అందించేం నిమిత్తం బయలుదేరిన రెండు హెలికాఫ్టర్లు వాతావరణం అనుకూలించకపోవడంతో వెనుతిరిగాయి. మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు.

English summary
Major part of Andhra Pradesh has been under siege by incessant rain. The districts of north coastal Andhra, including Visakhapatnam city, have been experiencing heavy rainfall since Tuesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X