Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ సచివాలయాల ఉద్యోగుల తాడోపేడో..! వాలంటీర్ల డ్యూటీ, సర్వేల వేళ..!

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ముందు పెట్టిన పలు డిమాండ్లపై పరిష్కారం లభించకపోగా.. కొత్త సమస్యలు తలెత్తుతుండటంపై వారిలో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా వాలంటీర్ల విధుల అప్పగింత,ఇంటింటి సర్వేలు చేయించడం సహా పలు సమస్యలపై వారు మరోసారి ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఈసారి తాడోపేడో తేల్చుకునేందుకు వారు సిద్దమవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన సమాఖ్య తరపున సచివాలయ ఉద్యోగుల సమస్యలపై గ్రామ వార్డ్ సచివాలయ శాఖ డైరెక్టర్ ను నేతలు కలిశారు. రేపు జరిగే చర్చల్లో GSWS హక్కుల సాధన సమాఖ్యని కూడా గుర్తించి ప్రాతినిధ్యం కల్పించాలని వారు కోరారు. గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల ప్రధాన సమస్యల పై GSWS డైరెక్టర్ తో 3 గంటల పాటు చర్చించారు. ఇందులో వారు పలు అంశాల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

ap village ward secretariat employees key decision amid volunteer duty transfer doorstep surveys

ఇందులో వాలంటీర్ విధుల నుండి తమకు విముక్తి కల్పించాలని కోరగా.. ప్రభుత్వం చెప్పిన పని విధిగా చేయాల్సిందేనని తేల్చిచెప్పేశారు. ముందే ఒప్పుకొని వచ్చారని, ఇప్పుడు చెయ్యను అంటే ఎలా అని డైరెక్టర్ వారిని ప్రశ్నించారు. పథకాల అమలు విషయంలో భాగస్వాములు కావాల్సిందేనని ఉద్యోగులకు సూచించారు. అయితే అన్ని శాఖల ఉద్యోగులకు వీటిని వర్తింపచేయాలని ఉద్యోగులు కోరారు.

అలాగే ఇంటింటి సర్వేల నుంచి తమను తప్పించాలని ఉద్యోగులు కోరారు. దీనికి ఈ విధులు కూడా తొలగించడం కుదరదన,ి తప్పకుండా చేయాల్సిందేనని తేల్చిచెప్పేసారు. అలాగే జాబ్ చార్ట్ కి సంబంధం లేని సర్వేలు చేయిస్తున్నప్పుడు వాటికి అదనంగా గౌరవ వేతనం ఇవ్వాలని కోరగా.. మాతృశాఖలో మీకు పని లేదు కనుక సర్వేలు చేయాల్సిందేనని డైరెక్టర్ తెలిపారు. అలాగే కార్యదర్శుల్ని జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ కు అప్ గ్రేడ్ చేయాలని కోరగా.. అదీ కుదరదని చెప్పేశారు. పే స్కేల్ పెంపుకూ అంగీకరించలేదు. హయ్యర్ లెవెల్ పోస్టులకు డిప్యుటేషన్ పై పంపినప్పుడు అదనపు మొత్తం చెల్లించేందుకు ససేమిరా అన్నారు.

ap village ward secretariat employees key decision amid volunteer duty transfer doorstep surveys

బీఎల్వో విధులు సచివాలయ ఉద్యోగులకే అప్పగిస్తున్న విషయం డైరెక్టర్ దృష్టికి తెస్తే.. పూర్తి వివరాలు కనుక్కుంటామన్నారు.
అదనపు డ్యూటీ లు చేసే వారికీ అలెవెన్స్ ఇప్పించాలని కోరగా.. అప్లై చేసుకోమని సలహా ఇచ్చారు. ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ కి హాజరు అదర్ ఆప్షన్ లో వేసుకునే వెసులుబాటు కల్పించేందుకు అంగీకరించారు. సచివాలయ ఉద్యోగుల కుటుంబ సభ్యుల్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో స్ప్లిట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలని కూడా కోరారు. అలాగే బకాయిల చెల్లింపు, ఇతర అంశాలపైనా చర్చించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+