హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

AP Weather: ఏపీలో మరో మూడురోజులపాటు వర్షాలు, వాయుగుండంగా అల్పపీడనం

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఎడతెరిపినిచ్చినట్లు కనిపించినా.. మళ్లీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర గల ప్రాంతంలో గల తుఫాను ప్రసరణ సగటు సముద్ర మట్టానికి 7.6 కిమీ ఎత్తు వరకు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో.. వచ్చే 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఈ అల్పపీడనం తర్వాత 48 గంటలలో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా బల పడుతుంది. దీని ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాల్లో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే భారీ వర్షాలతోపాటు చెరువులు నిండు కుండలను తలపిస్తుండగా, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు దారుణంగా తయారయ్యాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు.

AP Weather: Three more days heavy rains in few districts of andhra pradesh

శుక్రవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలో భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదివారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది

శుక్రవారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఆదివారం ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో శుక్రవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.

AP Weather: Three more days heavy rains in few districts of andhra pradesh

ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలోనూ మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమైందని తెలిపింది. ఈ ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొంది.

ఈ అల్పపీడనం పశ్చిమవాయువ్యదిశగా ప్రయాణించి ఆ తర్వాత 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షాలతోపాటు గాలులు కూడా వీస్తాయని పేర్కొంది. నిన్నమొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలు హైదరాబాద్, వరంగల్, సిరిసిల్ల జిల్లాలో తీవ్ర ప్రభావం చూపాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రహదారులు వరదనీటితో నిండిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

English summary
AP Weather: Three more days heavy rains in few districts of andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X