ఈస్ట్‌కోస్ట్ గేట్‌వేగా ఏపీ: బాబు, అమరావతిపై ఏమిటీ 'స్విస్ ఛాలెంజ్'?
రాజమండ్రి: కొత్త రాష్ట్రంలో సవాలక్ష సమస్యలు, సవాళ్లు ఉన్నాయని, వాటిని ఎదుర్కొంటూ పురోగమిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. ఆనం కళాకేంద్రంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంతీయ విద్యా సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. భారత్‌లో ఏ రాష్ట్రానికి లేని వనరులు ఏపీకి ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ కోస్ట్ గేట్‌వేగా మారే అవకాశముందన్నారు. నీటి వనరులతో అభివృద్ధిని వేగవంతం చేయొచ్చని, రాష్ట్రంలో ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువును నియంత్రిస్తామన్నారు.
పోర్టులన్నీ అభివృద్ధి చేస్తే అద్భుతంగా పురోగమిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నామని చెప్పారు. అనేక రాష్ట్రాల కంటే ఏపీకి వనరులు ఎక్కువగా ఉన్నాయన్నారు. వనరులను గరిష్టంగా సద్వినియోగం చేసుకుంటే మనం ఎవరి కంటే వెనుకబడమని చెప్పారు.

తూర్పు తీరంలో గేట్ వేగా అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉందని చెప్పారు. ఏపీని కరువు రహితం చేయడం పెద్ద కష్టం కాదన్నారు. ఏటా 3వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు మూడున్నర కోట్ల మంది పుష్కర స్నానం ఆచరించారని చెప్పారు.
స్విస్ ఛాలెంజ్ అంటే...?
స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అమరావతిని నిర్మిస్తామని చంద్రబాబు చెబుతోన్న విషయం తెలిసిందే. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తామని చెబుతున్నారు. అంటే, ఈ పద్ధతిలో బిడ్లను వేసిన తర్వాత, తక్కువ బిడ్ వేసిన వారికి కాంట్రాక్టును అప్పగించరు.
తిరిగి పోటీలో ఉన్న కంపెనీ, అంతకననా తక్కువ ధరకు మెరుగైన డిజైన్లో మరో ప్రణాళికను సమర్పించి కాంట్రాక్టును సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత మరో సంస్థ ఇంకో డిజైన్ ఇచ్చి, అది అధఇకారులకు నచ్చితే కాంట్రాక్టు ఆ సంస్థకు లభించే అవకాశాలు దగ్గర చేసే పద్ధతి ఉంది. అదే స్విస్ ఛాలెంజ్ పద్ధతి. నియమిత సమయంలో ఓ కంపెనీ ఇలా ఎన్నిసార్లయినా కాంట్రాక్టును సవరించుకోవచ్చు.












Click it and Unblock the Notifications