ఎవరు విడదీస్తారో చూద్దాం: తెలంగాణపై జగన్ సవాల్

తెలంగాణ ప్రాంతానికి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనులను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేశారన్నారు. ఓట్లు, సీట్ల కోసం, తన తనయుడు ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించే కుట్రకు తెరలేపారన్నారు.
సోనియా రాష్ట్రాన్ని విభజిస్తుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహకరిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అనుకూలంగా లేఖ ఇచ్చారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో చంద్రబాబు కుడి చేయి ఇలా లేపితే సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు లేస్తారని, ఎడమ చేయి లేపితే తెలంగాణ టిడిపి నేతలు లేస్తారని, సభ సాక్షిగా ఎర్రబెల్లి దయాకర రావు, పయ్యావుల కేశవ్‌లు చేస్తారని, ఇవేం రాజకీయాలని ప్రశ్నించారు. కిరణ్, చంద్రబాబులు తమలా ఎప్పుడైనా సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్షలు చేశారా? రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించారా? ధర్నాలు, ఆందోళనలు చేశారా? అని ప్రశ్నించారు. కెసిఆర్‌కు, చంద్రబాబుకు, కాంగ్రెసు పార్టీకి తేడా లేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం నుండి 30 పార్లమెంటు స్థానాలను గెలుచుకుందామని, అప్పుడు ఎవరు ఎపిని విడదీస్తారో చూద్దామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వారినే ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెడతామని చెప్పారు. సోనియా విభజిస్తుంటే కిరణ్ సహకరిస్తున్నారని మండిపడ్డారు. సభలో ఆఖరున జగన్ అందరిచే జై సమైక్యాంధ్ర, జై తెలుగు తల్లి, జై వైయస్సార్ అని నినాదాలు చేయించారు.












Click it and Unblock the Notifications