బసివిని, జోగిని, మాతంగి వ్యవస్థల నిర్మూలనపై ఏపీ మహిళా కమీషన్ ఫోకస్
అభం శుభం తెలియని ఆడపిల్లలను బలవంతంగా జోగినీలుగా, బసవినులుగా, దేవదాసీలుగా మాతంగులుగా మారుస్తున్నారు. దేవుడి సేవ పేరుతో వారి పైన లైంగిక వాంఛలను తీర్చుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాలకు గిరిజన ప్రాంతాలకు చెందిన బాలికలు ఈ రొంపిలో చిక్కుకొని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
బాలికలను బలి చేసే అనాగరిక ఆచారాలపై దృష్టి
ఈ క్రమంలో ఏపీ మహిళా కమిషన్ బాలికలను బలి చేసే ఈ అనాగరిక ఆచారాలకు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకుంది. అనాగరిక ఆచారాలు కొనసాగించకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. గిరిజన ప్రాంతాలలో మహిళల చట్టాలపై అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని మహిళా కమిషన్ తీర్మానించింది.

ఏపీ మహిళా కమీషన్ సమావేశం
నేడు మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి అధ్యక్షతన త్రైమాసిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిషన్ సభ్యులు గడ్డం ఉమా, బూసి వినీత, కమిషన్ కార్యదర్శి వసంత బాల హాజరయ్యారు. ఇటీవల జాతీయ మహిళా కమిషన్ అంతర్జాతీయ సదస్సులో గిరిజన ప్రాంత మహిళల ఆరోగ్యంపై నివేదించిన అంశాలమేరకు ప్రాజెక్ట్ ను చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి సభ్యులకు వివరించారు.
గత మూడు నెలల్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కరణ
గిరిజన ప్రాంతాల సందర్శన, అక్కడ నిర్వహించాల్సిన సదస్సులపై చర్చించారు. బసివిని, జోగిని, మాతంగి వంటి అనాగరిక ఆచారాలపై కమిషన్ సభ్యులు ప్రత్యేక దృష్టిపెట్టి వాటిని నిరోధించాలన్నారు. గత మూడు నెలల్లో కమిషన్ దృష్టికి వచ్చిన ఫిర్యాదులు, ఆయా కేసుల స్థితిపై సమీక్షించారు. సభ్యులకు కేటాయించిన ప్రాంతాల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారం పై కమిషన్ శరవేగంగా స్పందించాలన్నారు.
ఉమెన్ సేఫ్టీ ఆడిట్ పై వివరణ
కేసుల విచారణకు సంబంధించిన సమాచారాన్ని సభ్యులకు ఎప్పటికప్పుడు అందజేయాలని చైర్ పర్సన్ ఆదేశించారు. కార్యదర్శి వసంత బాల మాట్లాడుతూ హర్యానాలో జరిగిన జాతీయ మహిళా కమిషన్ సదస్సులో ప్రస్తావించిన ఉమెన్ సేఫ్టీ ఆడిట్ ను వివరించారు. కమిషన్ సభ్యులు ప్రతినెలా వారికి కేటాయించిన ప్రాంతాలలో చేపట్టే కార్యక్రమాల వివరాలను కమిషన్ కార్యాలయానికి పంపాల్సిందిగా కోరారు. సమావేశంలో కమిషన్ సెక్షన్ ఆఫీసర్లు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications