పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు- మూడు పెళ్లిళ్ల కామెంట్స్ పై సారీ చెప్పాలంటూ !
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం నేపథ్యంలో వైసీపీ నేతలు తనను మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ టార్గెట్ చేయడంపై స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్ కావాలంటూ మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది.
పవన్ కళ్యాణ్ చేసిన మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలపై స్పందించిన మహిళా కమిషన్ ఇవాళ ఆయనకు నోటీసులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై స్పందిస్తూ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆయనకు నోటీసులు పంపారు. ఇందులో ఆమె పలు విషయాల్ని ప్రస్తావించారు. పవన్ చేసిన మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలు సమాజంలో కలకలం రేపాయని, భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చనే సందేశం ఇస్తూ పవన్ మాట్లాడిన మాటలతో మహిళాలోకం షాక్ కు గురైందని వాసిరెడ్డి పద్మ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై వెంటనే సంజాయిషీ ఇస్తారని మహిళా కమిషన్ ఎదురుచూసినట్లు తెలిపారు. అయినా పశ్చాత్తాపం కానీ, క్షమాపణలు కానీ లేవన్నారు.

ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్లిళ్లి చేసుకోవాల్సి వస్తే అది కచ్చితంగా వ్యతిరేక అంశమేనని, కోట్ల రూపాయలు భరణం ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నానంటూ ఎలా మాట్లాడతారంటూ మహిళా కమిషన్ ఛైర్మన్ అభ్యంతరం తెలిపారు. చేతనైతే మీరూ చేసుకోమనడం సరికాదన్నారు. కోట్లు, లక్షలు, వేలు ఇలా ఎవరికి చేతనైతంతగా వారు భరణం ఇస్తూ పెళ్లిళ్లు చేసుకుంటూ పోతే ఓ మహిళ జీవితానికి భద్రత ఎలా ఉంటుందని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఓ సినిమా హీరోగా, పార్టీ అధ్యక్షుడిగా మీ మాటల ప్రభావం సమాజంపై ఉంటుందని మీకు తెలియదా అని కూడా ప్రశ్నించారు. మిమ్మల్ని ఫాలో అవుతున్న యువత ఈ వ్యాఖ్యల్ని ఆదర్శంగా తీసుకోరా అని పద్మ ప్రశ్నించారు.
అంతేకాదు, మీ ప్రసంగంలో స్టెప్నీ అనే పదం తీవ్ర ఆక్షేపణీయమని పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ తెలిపారు. మహిళల్ని భోగవస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు ఈ పదం వాడతారన్నారు. పవన్ వ్యాఖ్యలపై తమకు ఇప్పటికే చాలా మంది ఫిర్యాదులు చేశారని, ఈ మాటలు అవమానకరంగా, మహిళల భద్రతకు ప్రమాదకరంగా మారతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ తెలిపారు. కాబట్టి వెంటనే పవన్ కళ్యాణ్ తన మాటలపై మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మహిళా కమిషన్ ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications