మోడీ సాయం తెస్తారా ? ఎన్డీయే నుంచి తప్పుకుంటారా ? చంద్రబాబుకు షర్మిల డిమాండ్..!

విజయవాడ వరద బాధితులకు కేంద్రం నుంచి సాయం తెస్తారా లేక ఎన్డీయే నుంచి తప్పుకుంటారా అని సీఎం చంద్రబాబును పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. విజయవాడ పాత రాజరాజేశ్వరి పేటలో వరద బాధితులను ఇవాళ పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్బంగా బుడమేరు వరదపై టీడీపీ -వైసీపీ బురద రాజకీయాలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. బుడమేరు వరదకు ఇద్దరూ కారణమే అన్నారు. ఒకరు కాంట్రాక్టులు ఇచ్చారట. మరొకరు వాటిని రద్దు చేశారట అంటూ సెటైర్లు వేశారు.

విజయవాడ వరదలకు 7 లక్షల మంది నిరాశ్రయులైతే ప్రభుత్వం నిద్రపోతోందని షర్మిల మండిపడ్డారు. చంద్రబాబు విరాళాలు తీసుకోవాల్సింది చిన్న పిల్లల దగ్గర కాదని, చేతనమైతే కేంద్రం నుంచి సాయం తీసుకురావాలన్నారు. వరదలకు 6800 కోట్లు నష్టం జరిగిందని బాబు చెప్పారని, ఆయన చెప్పిన నష్టం వరకు అయినా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.వస్తున్నారు..నష్టం అంచనా అంటున్నారు, రూపాయి మాత్రం కేంద్రం నుంచి రాలేదని ఆరోపించారు. ఇంత నష్టం జరిగింతే మోడీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

apcc chief ys Sharmila demands Chandrababu to get centre s help to flood victims or else quit nda

బీజేపీ చేసిన మోసం పై చంద్రబాబు సమాధానం చెప్పాలని షర్మిల కోరారు. విజయవాడకి రైల్ నీర్ ఇవ్వాలని తాను కేంద్రమంత్రికి లేఖ రాసినా సమాధానం లేదన్నారు. విజయవాడ నుంచి ప్రతి ఏటా 6 వేల కోట్ల ఆదాయం వస్తుందని,ఇంతా ఆదాయం వస్తుంటే కేంద్రం కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని షర్మిల విమర్శించారు. చంద్రబాబు చిన్న పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం విడ్డూరమని, బాబు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ నుంచి అని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు బీజేపీ లో ఊడిగం చేస్తున్నారని, ఇదో పబ్లిసిటీ స్టంట్ అని అన్నారు. బీజేప నుంచి డబ్బులు తీసుకురాలేకపోతే ఎన్డీయే నుంచి తప్పుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+