Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

YS Sharmila: జగన్ రెడ్డి అంటే నచ్చట్లేదట..అలానే పిలుస్తా-వైవీకి షర్మిలా సవాల్

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ జిల్లాల పర్యటన ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఆమె జిల్లాల పర్యటన ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆమె ప్రతీ రోజూ రెండు నుంచి మూడు జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశాలకు వెళ్లేందుకు ఆమె పలాసలో ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దీంతో బస్సులో షర్మిలను చూసిన ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

పలాస దగ్గర కాంగ్రెస్ నేతలు మాణిక్కం ఠాకూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డితో కలిసి వైఎస్ షర్మిల ఆర్టీసీ బస్సు ఎక్కారు.పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఆమె బస్సులో ప్రయాణం చేశారు. మధ్యలో బస్సులో ప్రయాణికులతో షర్మిలతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ముఖాముఖీ మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు ఇతర వివరాలను ప్రయాణికులను షర్మిల ఆరా తీశారు. అలాగే వ్యక్తిగత అంశాల్ని కూడా మహిళా ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.

apcc chief YS Sharmila travels in apsrtc bus, chit chat with passengers on ysrcp government

వైఎస్ షర్మిల సడన్ గా బస్సు ఎక్కడం, తమతో మాట్లాడుతుండటంతో కాసేపు ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. తొలుత ముభావంగా స్పందించిన వారు.. ఆ తర్వాత సరదాగా మాట్లాడారు. షర్మిల అడిగిన ప్రశ్నలకు వారు జవాబిచ్చారు. ఎప్పుడూ టీవీల్లో కనిపించే షర్మిల నేరుగా తమ వద్దకు రావడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి 9 రోజుల పాటు షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటించబోతున్నారు.

మరోవైపు బస్సు ప్రయాణంలో వైఎస్ షర్మిల చివరిగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తనను పక్కరాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తిగా అభివర్ణించడంపై స్పందించారు. సుబ్బారెడ్డికి తాను జగన్ రెడ్డి అనడం నచ్చలేదని, మీకు నచ్చకపోతే ఇకపై జగనన్న గారూ అనే పిలుస్తానని షర్మిల తెలిపారు. తాము చేసిన అభివృద్ధి కనిపించడం లేదన్న సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మీ అభివృద్ధి చూపించడానికి సిద్ధమైతే తాను వస్తానని, మీడియా కూడా వస్తుందని డేట్, టైమ్ చెప్పాలని షర్మిల సవాల్ విసిరారు. మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ, రాజధాని ఎక్కడ అనేది తాము కూడా కళ్లలో ఒత్తులేసుకుని చూస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+