Amaravati: అమరావతిలో మహిళలకు సీఆర్డీయే గుడ్ న్యూస్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతి (Amaravati) రాజధానిని ఓవైపు వేగంగా నిర్మిస్తూనే .. మరోవైపు ఇక్కడి ప్రజల ఉపాధి అవకాశాలపైనా ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగా స్దానిక మహిళలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక్కడి మహిళలు స్వయంగా వారి కాళ్లపై నిలబడే విధంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఆర్డీయే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మహిళలకు ఉచితంగా బ్యూటిషియన్ కోర్సు ఆఫర్ చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ఇవాళ అధికారుల విడుదల చేశారు.

అమరావతి గ్రామాలలోని మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశ్యంతో APCRDA ఆధ్వర్యంలో అమరావతి ప్రాంత మహిళలకు బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2026 జూన్ ఒకటో తేదీ తేదీ నుంచి అమరావతి SRM యూనివర్సిటీలో ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ శిక్షణకు హాజరయ్యే వారికి ఉచిత రవాణా, మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తారు.

APCRDA Launches Free Beautician Training for Amaravati Women Eligibility Details and How to Apply

ఈ కోర్సులో చేరే మహిళలకు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు నెలల పాటు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలిపారు. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలలో నివసిస్తున్న ఆసక్తి కలిగిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలలో చేరేందుకు రాజధాని గ్రామాల్లోని CRDA ఫెసిలిటేటర్‌‌ను లేదా 9848424207 నెంబరులో శంకర్ అనే ఉద్యోగిని సంప్రదించాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+