రామ్ చరణ్ తో దర్శకుడికి విభేదాలు?
ప్రతి సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకతను చూపుతూ రామ్ చరణ్ (Ramcharan) గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ వీరాభిమానులను సంపాదించుకున్నాడు. ఈ మెగా పవర్ స్టార్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లఖియా రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
రామ్ చరణ్ కథానాయకుడిగా బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లఖియా (Apoorva Lakhia) తెరకెక్కించిన చిత్రం జంజీర్. తెలుగులో 'తుపాన్' (Thoofan) పేరుతో విడుదలైంది. ఇది ప్లాప్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ అపూర్వ లఖియాను దూరం పెట్టారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ''రామ్ చరణ్, తాను మంచి స్నేహితులమని, 'జంజీర్' తర్వాత కూడా ఎన్నో సార్లు వాళ్లింటికి వెళ్లినట్లు అపూర్వ తెలిపారు.రామ్ చరణ్ వాళ్ల ఇంట్లో చాలారోజులు ఉన్నానని, ఇప్పుడు మాత్రం తన ఫోన్ తీయడంలేదన్నారు. సినిమా పనుల్లో బిజీగా ఉండటంవల్ల ఫోన్లకు ఆన్సర్ చేయడంలేదని, తన ఫోన్లకు ఉపాసన ఆన్సర్ చేస్తుందన్నారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు.

RRR షూటింగ్ సమయంలో తాము మాట్లాడుకున్నామని, ఉక్రెయిన్‌లో షూటింగ్ జరిగేటప్పుడు చరణ్ ఫోన్ చేసినట్లు తెలిపారు. తామిద్దరం యాక్షన్ సన్నివేశాల గురించి చర్చించుకున్నామని, హైదరాబాద్‌కు ఇప్పుడు వెళ్లినా అతడు తనను కలుస్తాడన్నారు. 'జంజీర్'తో రామ్ చరణ్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో కథానాయికగా ప్రియాంక చోప్రా నటించింది. 2013లో వచ్చిన ఈ చిత్రం ఫెయిలైంది. రామ్ చరణ్, ప్రియాంక జోడీ బాలేదంటూ ట్రోల్స్ చేశారు. సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.












Click it and Unblock the Notifications