APPSC గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఎప్పుడంటే ? గౌతం సవాంగ్ కీలక ప్రకటన..
ఏపీలో ఎన్నికల ఏడాది ఏపీపీఎస్సీ గుర్తించిన దాదాపు వెయ్యికి పైగా ఖాళీల్ని త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీ కోసం ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జారీ చేయాల్సిన నోటిఫికేషన్లపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ ఇవాళ కీలక ప్రకటన చేశారు. దీంతో ఈ ఏపీపీఎస్సీ ఖాళీల భర్తీపై ఓ క్లారిటీ వచ్చినట్లయింది.
మరోవైపు గతేడాది సెప్టెంబర్లో జారీ చేసిన నోటిఫికేషన్ కు సంబంధించి జరుగుతున్న ప్రక్రియను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ ఇవాళ వెల్లడించారు. గత ఏడాది జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటికే జనవరి 8న ప్రిలిమ్స్ పరీక్షలు జరగగా.. జూన్ 3 నుంచి 10వ తేదీ వరకూ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని సవాంగ్ తెలిపారు. ప్రిలిమ్స్ పరీక్షలు జరిగిన 19 రోజుల్లోనే ఫలితాలు వెల్లడించామని, ఇందులో 6455 మంది మెయిన్స్ కు అర్హత సాధించారని సవాంగ్ వెల్లడించారు. జూన్ 3 నుంచి జరిగే మెయిన్స్ పరీక్షను 10 జిల్లాల్లోని 11 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

జూన్ 3 నుంచి జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ వెల్లడించారు. అయితే పరీక్షా కేంద్రానికి మాత్రం ఉదయం 9.30కే చేరుకోవాలని ఆయన సూచించారు. ఉదయతం 8.30 నుంచి 9.30 వరకూ మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అభ్యర్ధుల్ని అనుమతిస్తామన్నారు. అయితే 15 నిమిషాల గ్రేస్ పిరియడ్ ను కూడా ఇస్తామన్నారు. వీటి ఫలితాలను జూలైలో విడుదల చేసి ఆగస్టులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని సవాంగ్ వెల్లడించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications