APPSC : ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల...
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసింది.ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం(ఏప్రిల్ 28) ప్రకటించింది. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ www.psc.ap.gov.inలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఉంచారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 14వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
ఇంటర్వ్యూలకు సంబంధించి ఏపీపీఎస్సీ నుంచి అభ్యర్థులకు వ్యక్తిగత కాల్ లెటర్స్ కూడా అందుతాయి. ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. వయసు,విద్యార్హతలు,స్టడీ సర్టిఫికెట్,రెసిడెన్సీ సర్టిఫికెట్,లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ తదితర సర్టిఫికెట్లు,డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించకపోతే వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది.

కాగా,2018లో ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేయగా డిసెంబర్,2020లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 9,679 మంది అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హాజరైనట్లు తెలుస్తోంది.రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 41 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇందులో 34 సెంటర్లు ఏపీలో ఉండగా, 7 సెంటర్లు హైదరాబాద్‌లో ఉన్నాయి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications