ఏపీ వాసులకు బిగ్ అలర్ట్ - మరో మూడు రోజులు తప్పదు..!!

ఏపీలో వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. భారీ ఉష్ణోగ్రతలు..ఆ తరువాత అకాల వర్షాలతో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దాదాపు వారం రోజులుగా అకాల వర్షాలు ఏపీలోని పలు ప్రాంతాల్లో ముంచెత్తుతున్నాయి. భారీగా పంట నష్టం జరిగింది.

ఇదే సమయంలో తుఫాను హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఈ తుపానుకు మోకా గా పేరు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు తప్పవని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

APSDMA Alerts Light to moderate rains are expected at many parts of Andhra Pradesh in next three days

కొనసాగుతున్న ద్రోణి: దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆనుకుని ఉన్న తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి కొనసాగుతోందని విపత్తలు నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ రోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్,శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

మోస్తరు నుంచి భారీ వర్షాలు: రేపు అదివారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. వైఎస్ఆర్, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. 7న అల్పపీడనంగా మారి.. 8న వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు. ఈ తుపాను పశ్చిమ బెంగాల్, మయన్మార్‌ల వైపు పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్ర పైన ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు.

పలు జిల్లాల్లో పంట నష్టం: కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం, గాలుల తీవ్రత కారణంగా నష్టం జరిగింది. అల్లూరి జిల్లా ఏజన్సీ ప్రాంతంలో వానలు కొనసాగుతున్నాయి. అరకు ఏజెన్సీలోకురిసిన భారీ వర్షంతో కేకే లైన్లో కరకవలస రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్‌పై ప్రవహిస్తోంది వరదనీరు. కొండలపై నుంచి వచ్చి చేరుతున్న నీరు దూసుకురావడంతో ట్రాక్‌ అంతా మట్టితో నిండిపోయింది.

బాపట్ల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం రైతులకు నష్టం మిగిల్చింది. ప్రభుత్వం కలెక్టర్లను అప్రమత్తం చేసింది. పంటనష్టం పైన వివరాలను అందించాలని ఆదేశించింది. విపత్తుల నిర్వహణ సంస్థ తాజా హెచ్చరికలతో మరో మూడు రోజులు వర్షాలు తప్పేలా లేవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+