ఏపీలో ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్- పిడుగుపాటు హెచ్చరికలు..!

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. దీంతో పాటు పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇవాళ మధ్యాహ్నం వర్షాలపై అలర్ట్ లు జారీ చేసింది. వీటితో పాటు పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు కూడా చేసింది. ముందుగా విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

APSDMA Issues Red Orange Yellow Alerts and Thunderbolt Warnings for These Districts

చివరిగా తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని ఎల్లో అలెర్ట్
జారీ చేసింది. ఆయా జిల్లాల్లో 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ప్రజలు చెట్ల కింద నిలబడరాదని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+