కడప స్టీల్ ప్లాంట్ కు గుడ్ న్యూస్-మరో 4 కీలక ప్రాజెక్టులకూ-రూ.23985 కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం..

ఏపీలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కీలక ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇవాళ తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి రూ.23985 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో కడప స్టీల్ ప్లాంట్ తో పాటు మరికొన్ని కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి కార్యరూపం దాలిస్తే వేల సంఖ్యలో ఉద్యోగాలు లభించడం ఖాయం.

జగన్ అధ్యక్షతన ఎస్ఐపీబీ భేటీ

జగన్ అధ్యక్షతన ఎస్ఐపీబీ భేటీ


సీఎం జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలంయలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. ఇందులో కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో జేఎస్‌ డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంప్డ్ హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు అవకాశం కలగబోతోంది.

కడప స్టీల్ ప్లాంట్ కు గుడ్ న్యూస్

కడప స్టీల్ ప్లాంట్ కు గుడ్ న్యూస్

కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌ డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్‌ నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ కు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు విడతల్లో మొత్తంగా రూ.8,800 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ నిర్మాణం కానుంది. మొదటి విడతలో రూ.3,300 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. మొదటి దశలో ఏడాదికి 1 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు, రెండో విడతలో ఏడాదికి 2 మిలియన్ టన్నుల స్టీల్‌ ఉత్పత్తులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లెక్కన మొత్తంగా ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తులు చేయబోతున్నారు. దీనికి త్వరలో పనులు ప్రారంభమవుతాయి. వీలైనంత త్వరగా ప్లాంట్ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం జగన్ ఈ సందర్భంగా కోరారు. వెనకబడ్డ రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే ప్రక్రియలో ఇదొక గొప్ప ప్రయత్నమని సీఎం జగన్ అభివర్ణించారు. ఈ ప్లాంట్ రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయని, తద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.

1600 మెగావాట్ల అదానీ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులు

1600 మెగావాట్ల అదానీ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులు

రాష్ట్రంలో 1600 మెగావాట్ల సామర్ధ్యంతో పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు కూడా ఎస్ఐపీబీ ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రూ.6,330 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్రత్యక్షంగా 4వేలమందికి ఉపాధి కలగబోతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో వేయి మెగావాట్లు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్ద 600 మెగావాట్ల ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. 2024 డిసెంబర్లో ప్రారంభించి... నాలుగేళ్లలోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదికి 4,196 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా వీటిని నిర్మిస్తున్నారు.

రూ.8855 కోట్లతో హైడ్రోస్టోరేజ్ ప్రాజెక్టులు

రూ.8855 కోట్లతో హైడ్రోస్టోరేజ్ ప్రాజెక్టులు


అలాగే రాష్ట్రంలో మరో రూ.8,855 కోట్లతో నిర్మించే హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టులకు కూడా ఎస్ఐపీబీ ఇవాళ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని ఎర్రవరం, సోమశిల వద్ద షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రెండు హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా 2100 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల ప్రాజెక్టు, 900 మెగావాట్ల రెండో ప్రాజెక్ట్ సోమశిల వద్ద ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది జులైలో ప్రారంభమై విడతల వారీగా ఐదేళ్లలో అంటే డిసెంబర్ 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో ప్రత్యక్షంగా 2100 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+