ఏపీకి లక్షా 14 వేల కోట్లు-67 వేల జాబ్స్..!

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఈ కాలంలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వం వదులు కోవడం లేదు. దేశ విదేశాల్లో పర్యటించి మరీ పెట్టుబడులకు ఆహ్వానాలు పలుకుతున్నారు. అదే సమయంలో ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఐటీ, ఇంధనం, టూరిజం, ఎరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కిపైగా ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేశారు. వీటి ద్వారా 67 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు.

APSIPB Approves 1 14 Lakh Crore Investments Creating 67 000 Jobs

రాష్ట్రంలో రూ.87,520 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు RAIDEN INFO TECH DATA CENTER ముందుకొచ్చింది. దీనికి ఎస్ఐపీబీ భేటీలో ఆమోదం తెలిపారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఎఫ్.డీ.ఐ రాలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. RAIDEN INFO TECH DATA CENTER ఏర్పాటు కొత్త చరిత్రను లిఖిస్తుందని వెల్లడించాయి. అతిపెద్ద ఫారిన్ ఇన్వెస్టిమెంట్ సాధించడంపై ఐటీ మంత్రి నారా లోకేష్‌కు ముఖ్యమంత్రి, మంత్రులు అభినందనలు తెలిపారు.

APSIPB Approves 1 14 Lakh Crore Investments Creating 67 000 Jobs

ఈ 15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన SIPB సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ జరిగింది. భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారుల నియామకానికి నిర్ణయించారు. కంపెనీలు త్వరగా గ్రౌండ్ అయ్యేలా ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకోనున్నారు. ఇప్పటి వరకు జరిగిన 11 పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీల ద్వారా రూ.7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా మొత్తం 6.2 లక్షల మందికి ఉద్యోగాలు లబిస్తాయని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+