APSRTC ఊటీ , రామేశ్వరం యాత్ర - 13 క్షేత్రాలు, ప్యాకేజీ ఇలా..!!
ఏపీఎస్ఆర్టీసీ మరో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. వేసవి వేల ఊటీతో సహా ప్రముఖ ఆలయాల సందర్శకు వీలుగా ఈ ప్యాకేజీ ఖరారు చేసింది. తొమ్మది రోజుల పాటు సాగే ఈ యాత్రలో 13 ప్రముఖ క్షేత్రాల దర్శన ఉండనుంది. రంగంతో పాటు అరుణాచలం, మధురై, రామేశ్వరం వంటి ప్రముఖ ఆలయాలను ఈ ప్యాకేజీలో చేర్చారు. వేసవి సెలవులు ప్రారంభం అవుతున్న వేళ ఆర్టీసీ ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ధరలను వెల్లడించింది.
రాజమహేంద్రవరం నుంచి ఏపీఎస్ఆర్టీసీ తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. 'అరుణా చలం- రామేశ్వరం యాత్ర' పేరుతో ప్రత్యేక బస్సు ను ఏర్పాటు చేసింది. తొమ్మది రోజులు పాటు ఈ యాత్ర కొనసాగనుంది. 13 పుణ్య క్షేత్రాలు ఈ టూర్ లో దర్శించుకునే అవకాశం కల్పించింది. రాజమండ్రి డిపో నుంచి ఈ నెల 19న సాయంత్రం 6 గంటలకు బస్సు బయల్దేరేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ యాత్రకు టికెట్ ఛార్జీ ఒక్కొక్కరికి రూ.10,500గా నిర్ణయించారు.

టికెట్ల బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు వెల్లడించారు. నలుగురు కంటే ఎక్కువ మందికి వీలుగా బుక్ చేసుకుంటే ఇంటికే వచ్చి టికెట్లు అందించే వెసులుబాటు కల్పించారు. ప్యాకేజీలో భాగంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తామని వెల్లడించారు. ఈ ప్యాకేజీలో ఏపీలోని కాణిపాకం మహాగణపతి ఆలయంతో పాటు తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్ (శ్రీపురం), అరుణాచలేశ్వరస్వామి ఆలయం (అరుణాచలం), సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం పళని) దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆదియోగి దేవాలయం(కోయంబత్తూర్), ఉద్యానవనం ప్రదేశం(ఊటీ), చాముండేశ్వరి ఆలయం(మైసూర్), కృష్ణ ఆలయం(గురువాయుర్) ఉన్నాయి.
అదే విధంగా పద్మనాభస్వామి ఆలయం(త్రివేండ్రం), కన్యకా పరమేశ్వరి ఆలయం(కన్యాకుమారి), మధురమీనాక్షి ఆలయం(మధురై), రామేశ్వర జ్యోతిర్లింగం(రామేశ్వరం), రంగనాధ ఆలయం శ్రీరంగం) ఆలయాలు ప్యాకేజీలో ఉన్నాయి. యాత్రకు వెళ్లాలనుకునే వారు 99666 66544, 98660 45588 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications