Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

APSRTC కీలక నిర్ణయం-'టికెట్ మెసేజ్ లో డ్రైవర్ సెల్ నంబర్ ఉండదిక-రీజన్ ఇదే

ఏపీలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. దీనికి డ్రైవర్ల నిర్లక్ష్యం ఓ కారణమైతే, వారి దృష్టిని మరల్చే కారణాలు మరోవైపు ఉన్నాయి. వీటితో పాటు కరోనా సమయంలో బస్సులు బయటికి తీయక ఫిట్ నెస్ సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. కారణాలేవైనా ఒకప్పుడు సురక్షితంగా ప్రయాణికుల్ని గమ్యస్ధానాలకు చేర్చిన ఆర్టీసీ బస్సులు ప్రమాదాల బారిన పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

 ఏపీఎస్ ఆర్టీసీ కష్టాలు

ఏపీఎస్ ఆర్టీసీ కష్టాలు

ఏపీలో ఆర్టీసీ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. కరోనాకు ముందే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఉద్యోగులు, కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్ధితికి చేరిన ఆర్టీసీని వైసీపీ సర్కార్ ఆదుకుంది. 52 వేల మంది ఉద్యోగుల్ని ఆర్టీసీ నుంచి ప్రభుత్వంలోకి తీసుకున్నారు. అయితే ఆర్టీసీ నుంచి తీసుకున్న రుణాలు పెండింగ్ లో ఉండటం, ఇతరత్రా కారణాలతో కార్పోరేషన్ మాత్రం కొనసాగుతోంది. బస్సులన్నీ ఈ కార్పోరేషన్ పేరుతో తీసుకున్నవే. ఇప్పుడు అవే బస్సులు కరోనా సమయంలో బయటకు తీయక ఫిట్ నెస్ కోల్పోయాయి. వీటికి తోడు డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీంతో ఆర్టీసీ బస్సులు సురక్షితమన్న వాదనకు కాలం చెల్లుతోంది.

 డ్రైవర్ల సమస్యలు

డ్రైవర్ల సమస్యలు

ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లపై కొన్నేళ్లుగా అదనపు భారం పడుతోంది. అదనపు సర్వీసులకు తోడు, అదనపు పనులు కూడా అఫ్పజెప్పి డ్రైవర్లను కూడా అధికారులు యంత్రాలుగా మార్చేస్తున్నారు. ఇందులో భాగంగా డ్రైవర్లకు డ్రైవింగ్ కు తోడు లోడింగ్, అన్ లోడింగ్ పనులు, ప్రయాణికులకు టిమ్ యంత్రాల ద్వారా టికెట్లు ఇచ్చే పని కూడా అఫ్పగించారు. దీనికి తోడు ప్రయాణికులకు ఆన్ లైన్ ద్వారా వారి సెల్ ఫోన్లకు పంపుతున్న టికెట్ల మెసేజ్ లలో వీరి నంబర్లు ఇస్తున్నారు. దీంతో డ్రైవర్ల ఇబ్బందులు మరింత తీవ్రతరం అయ్యాయి. ఇవే తాజాగా ప్రమాదాలకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు.

 టికెట్ మెసేజ్ లో డ్రైవర్ల నంబర్లపై అభ్యంతరాలు

టికెట్ మెసేజ్ లో డ్రైవర్ల నంబర్లపై అభ్యంతరాలు

ప్రయాణికులకు టికెట్లు ఇచ్చిన తర్వాత వారికి సదరు టికెట్ బుక్కయిన విషయం తెలిసేందుకు వీలుగా వారి మొబైల్ ఫోన్లకు ఆర్టీసీ మెసేజ్ లు పంపుతోంది. ఇందులో డ్రైవర్ల సెల్ ఫోన్ నంబర్లను కూడా ఇస్తున్నారు. దీంతో దూర ప్రాంత సర్వీసులకు వెళ్లే డ్రైవర్లకు మధ్యలో స్టాపుల్లో ఆగిన ప్రయాణికులు బస్సు ఎప్పుడు వస్తుంది, ప్రస్తుతం ఎక్కడ ఉంది అనే విషయాలపై తరచూ ఫోన్లు చేస్తున్నారు. దీంతో డ్రైవర్లకు ఇదో చికాకుగా మారింది. చివరికి బస్సు డ్రైవర్ల దృష్టి మరల్చి ప్రమాదాలకు కూడా కారణమవుతోంది. దీంతో ఇకపై ఈ విధానాన్ని సమీక్షించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.

 మెసేజుల్లో డ్రైవర్ల నంబర్లు ఉండవిక

మెసేజుల్లో డ్రైవర్ల నంబర్లు ఉండవిక

ప్రయాణికులకు ఆర్టీసీ పంపుతున్న మెసేజుల్లో డ్రైవర్ల నంబర్లు ఇవ్వడం వల్ల వాళ్లు తరచుకూ డ్రైవర్లకు ఫోన్లు చేస్తున్నారు. దీంతో ఈ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా వరుసగా ఫోన్లు రావడం వల్ల డ్రైవర్ల దృష్టి డ్రైవింగ్ పై ఉండటం లేదని, ఇదే ప్రమాదాలకు కారణమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. చివరికి డ్రైవర్లు కూడా తమ మొబైల్ నంబర్లు ఇవ్వొద్దంటూ పలుసార్లు అధికారులకు మొర పెట్టుకున్నారు. అయినా ఇన్నాళ్లు పట్టించుకోని ఆర్టీసీ అధికారులు.. ఇప్పుడు తాజా ప్రమాదాలతో కళ్లు తెరిచినట్లు కనపిస్తోంది. ఇకపై ప్రయాణికలకు వెళ్లే టికెట్ మెసేజుల్లో డ్రైవర్ల నంబర్లు ఇవ్వకూడదని నిర్ణయించారు. దీంతో డ్రైవర్లకు భారీ ఊరట దక్కినట్లయింది.

Recommended Video

    Vijayawada లో Sonu Sood కి ఊహించని క్రేజ్.. Amaravati రైతులకి మాటిచ్చిన సోనూ || Oneindia Telugu

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+