APSRTC : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్- ఇకపై బస్సుల్లో ఏ కార్డు తీసుకెళ్లకున్నా రాయితీ..!

ఏపీలో సీనియర్ సిటిజన్లకు(వృద్ధులకు) ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో కరోనా సమయంలో రాయితీలు ఎత్తేసి ఆ తర్వాత పునరుద్ధరించిన ఆర్టీసీ.. ఇప్పుడు మరో అంశంలోనూ వృద్ధులకు ఊరట లభించే నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సీనియర్ సిటిజన్లు ఎలాంటి కార్డులు లేకుండానే టికెట్ పై రాయితీ లభించే అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు ఆరు రకాల ఐడీ కార్డులు చూపిస్తే టికెట్ పై 25 శాతం రాయితీ ఇస్తున్నారు. ఇందులో ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్ పోర్టు, రేషన్ కార్డు ఉన్నాయి. ఈ ఆరు కార్డుల్లో ఏదో ఒక కార్డు తమ వెంట తీసుకెళ్లడంతో పాటు బస్సుల్లో కండక్టర్ కు చూపిస్తేనే రాయితీపై టికెట్ ఇస్తున్నారు. లేకపోతే రాయితీ ఇవ్వడం లేదు. కానీ వృద్ధులు తమతో పాటు వీటిని గుర్తుపెట్టుకుని తీసుకెళ్లడం కష్టంగా మారింది.

apsrtc good news to senior citizens-accept these digital id proofs also for concession

ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్ల నుంచి ప్రభుత్వానికి పలు వినతులు అందాయి. బస్సుల్లో ప్రస్తుతం భౌతిక రూపంలో అనుమతిస్తున్న ఆరు ఐడీ కార్డుల్ని డిజిటల్ రూపంలోనూ అనుమతించాలని వారు కోరుతున్నారు. ఈ వినతుల్ని పరిశీలించిన ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఇకపై ఈ కార్డుల్ని ఫోన్లో డిజిటల్ రూపంలో ఉన్నా అనుమతించేలా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇందులో ఆధార్ కార్డు మాత్రమే డిజిటల్ రూపంలో ఉండటంతో దాన్ని మాత్రమే అనుమతిస్తారు.

ఆర్టీసీ బస్సుల్లో ఇచ్చే టికెట్లతో పాటు ఆర్టీసీ ఓపీఆర్ఎస్ కౌంటర్లలోనూ, ఏటీబీ ఏజెంట్ల ద్వారా ఇచ్చే టికెట్లకూ ఇదే నిబంధన వర్తింప చేయాలని ఆర్టీసీ ఈడీ డీఎంలకు, సూపర్ వైజర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ మూడు చోట్ల కూడా వృద్ధులు కేవలం ఆధార్ కార్డు ఫోన్లో చూపించి 25 శాతం రాయితీపై టికెట్లు పొందేందుకు అవకాశం లభించింది. ప్రభుత్వ నిర్ణయంపై వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+