APSRTC: హైదరాబాద్‌కు డాల్ఫిన్ క్రూయిస్ మల్టీ యాక్సిల్ బస్సులు..!!

అమరావతి: ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. వివిధ నగరాలు, జిల్లా కేంద్రాలకు ఇదివరకు స్టార్ లైనర్ 2+1 నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. రద్దీ మార్గాల్లో వాటిని ప్రవేశపెడుతోతంది. వాటికి ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన లభించిన నేపథ్యంలో మరన్ని కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఇందులో భాగంగా- నైట్ రైడర్ పేరుతో ఏసీ సీటింగ్ కమ్ స్లీపర్ కోచ్ బస్సులను ప్రవేశపెట్టింది. సీటింగ్ ప్లస్ స్లీపర్ కోచ్ ఇది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ఈ బస్సులు పరుగులు పెడుతోన్నాయి. వాటికి కూడా అంచనాలకు మించి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. వారాంతపు, సెలవు రోజుల్లో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది.

APSRTC introduced Dolphin cruise bus service to Hyderabad from various cities

స్టార్ లైనర్ పేరుతో నాన్ ఏసీ బస్సులను నడిపిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. వీటికీ మంచి డిమాండ్ ఏర్పడింది ప్రయాణికుల్లో. రైలు స్లీపర్ కోచ్ లను తలదన్నేలా దీన్ని డిజైన్ చేయడం వల్ల ఈ సర్వీసులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. నాన్ ఏసీ కావడం వల్ల ఛార్జీ కూడా అందుబాటులోనే ఉంటోంది.

ఇక తాజాగా డాల్ఫిన్ క్రూయిస్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీఎస్ఆర్టీసీ. గతంలో విశాఖపట్నానికే పరిమిత బస్సులు ఇవి. విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతంలోని పలు నగరాలకు ఈ డాల్ఫిన్ క్రూయిజ్ ఈ బస్సులు నడిచేవి. వోల్వో మల్టీయాక్సిల్ బస్సులు ఇవి. దీని పొడవు 14.5 మీటర్లు.

ప్రయాణికుల నుంచి వీటికి లభిస్తోండటాన్ని దృష్టిలో ఉంచుకుని డాల్ఫిన్ క్రూయిజ్ బస్సు సర్వీసుల సంఖ్యను భారీగా పెంచారు. వాటి సేవలను మరిన్ని జిల్లాలకు విస్తరించారు. హైదరాబాద్ గమ్యస్థానంలో చేసుకుని పలు బస్సులను ప్రవేశపెట్టారు. వాటికీ మంచి ఆదరణ లభిస్తోంది ప్రయాణికుల నుంచి.

విశాఖపట్నం- హైదరాబాద్, విజయవాడ- హైదరాబాద్, నెల్లూరు- హైదరాబాద్, కందుకూరు- హైదరాబాద్, పులివెందుల- హైదరాబాద్ మార్గాల్లో కొత్తగా ఈ డాల్ఫిన్ క్రూయిజ్ బస్సులు రాకపోకలు సాగిస్తోన్నాయి. ప్రయాణికుల నుంచి అందుతోన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వాటి సంఖ్యను పెంచుతామని ఏపీఎస్ఆర్టీసీ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+