APSRTC బంపర్ ఆఫర్-బస్సుకు పేరు పెట్టు-నగదు బహుమతి పట్టు-వివరాలివే..

ఏపీలో ఆర్టీసీని నష్టాల బారి నుంచి గట్టెక్కించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. విన్నూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నగదు రహిత టికెటింగ్ విధానాలతో పాటు పలు సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం... ప్రయాణికుల్ని ఏదో విధంగా తమ సేవల్లో భాగస్వాముల్ని చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం తాజాగా అందుబాటులోకి వస్తున్న దూర ప్రాంత సర్వీసులకు పేరు పెడితే నగదు బహుమతులు ఇస్తామని ప్రకటించింది.

ఆర్టీసీ బంపర్ ఆఫర్

ఆర్టీసీ బంపర్ ఆఫర్


ఏపీలో ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అధికారులు రోజుకో కొత్త నిర్ణయంతీసుకుంటున్నారు. అసలే మండిపోతున్నధరలతో జనం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికిసైతం మొగ్గు చూపని పరిస్ధితి. దీంతో తిరిగి వారిని ఏదో విధంగా ఆర్టీసీకి, బస్సు ప్రయాణానికీ దగ్గర చేసేందుకు తమ నిర్ణయాల్లో సైతం భాగస్వాముల్ని చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆర్టీసీ ఎండీ ఓ కొత్త ఆఫర్ ప్రకటించారు. ఇది ప్రయాణికులకే కాదు అందరికీ వర్తిస్తుంది.

ఆర్టీసీ బస్సుకు పేరు పెడితే క్యాష్ ప్రైజ్

ఆర్టీసీ బస్సుకు పేరు పెడితే క్యాష్ ప్రైజ్

దూర ప్రాంతాలకు తిరిగే ఆర్టీసీ బస్సులకు గతంలో కృష్ణవేణి, గోదావరి వంటి పేర్లు దర్శనమిచ్చేవి. కానీ ఆ తర్వాత అన్నీ కాలంతో పాటే కనుమరుగయ్యాయి. దీంతో ఇప్పుడు ప్రభుత్వం తిరిగి ఆ విధానానికే మొగ్గుచూపుతోంది. ముఖ్యంగా దూర ప్రాంత సర్వీసులకు జనానికి దగ్గరగా ఉండే పేర్లను పెడితే తిరిగి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తోంది. అందుకే ఇప్పుడు సదరు సర్వీసులకు కొత్త పేర్లు సూచించిన వారికి నగదు బహుమతి అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే నగదు బహుమతి ఎంత ఇస్తారన్నది మాత్రం ప్రకటించలేదు.

బస్సులకు పేర్లు సూచించాలంటే..

బస్సులకు పేర్లు సూచించాలంటే..

ఆర్టీసీ తాజాగా దూర ప్రాంతాలకు నాన్-ఏసీ స్లీపర్ సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటివరకూ వెన్నెల వంటి ఏసీ స్లీపర్ సర్వీసులతో పాటు ఇతర సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ.. నాన్-ఏసీ స్లీపర్ సర్వీసులు మాత్రం లేవు. ఇప్పుడు నాన్-ఏసీ స్లీపర్ సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణికుల నుంచి మంచి స్పందన ఉంటుందని ఆశిస్తోంది. అందుకే కొత్తగా ప్రవేశపెట్టే స్లీపర్ సర్వీసులకు పేర్లు సూచించాలనుకునే వారు oprshoapgmail.com అనే అడ్రస్ కు మెయిల్ పంపాల్సి ఉంటుంది. దీన్ని పరిశీలించి నచ్చితే ఆ పేరు సూచించిన వారికి నగదు బహుమతి అందిస్తామని ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. ఈ కొత్త నాన్-ఏసీ స్లీపర్ బస్సుల్లో 30 బెర్త్ లు ఉంటాయని, ప్రతీ బెర్తుకూ ఫ్యాన్, నైట్ ల్యాంప్ సదుపాయం కల్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+