APSRTC ప్రైవేటీకరణపై తాడోపేడో ? 8న ఉద్యోగుల జేఏసీ భేటీ- కీలక ప్రకటన ..!
ఏపీఎస్ ఆర్టీసీలో (APSRTC)ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రవేశ పెట్టబోతున్న విద్యుత్ బస్సులను నడిపించే విధానాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని,ఈ-విద్యుత్ బస్సుల కొనుగోలుకు ప్రైవేట్ ఆపరేటర్లకు కేంధ్రప్రభుత్వం ఇస్తున్న రాయితీలను రాష్ట్రప్రభుత్వం,ఆర్టీసి యాజమాన్యం తీసుకొని ఆర్టీసి సిబ్బందితోనే స్వంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నా.. పట్టించుకోకుండా ముందుకెళ్తున్న తరుణంలో ఉద్యోగ సంఘాలు కీలక నిర్ణయాల దిశగా అడుగులేస్తున్నాయి.
ప్రైవేటు సంస్థల నిర్వహణతో పాటు విలువైన డిపోల స్దలాలను పూర్తిగా లీజు పేరుతో కట్ట బెట్టే ప్రయత్నాలను అడ్డుకొనేందుకు, దీర్ఘకాలికంగా ఆర్టీసీలో ఉన్న సమస్యలు,స్త్రీ-శక్తి పధకం వల్ల ఇబ్బందులపై ఆర్టీసీలో ఉద్యోగులంతా ఏకమవుతున్నారు.
ఆర్టీసీలో ఉన్న ఉద్యోగ సంఘాలను అన్నింటిని కలుపుకొని ఏపీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటి ఏర్పాటు చేయాలని నిర్ణయింంచాయి. జూన్ 8 న విజయవాడలో ప్రభుత్వంలో ఆర్టీసి విలీనం కాకముందు ఉన్న అన్ని ఉద్యోగసంఘాలు / అసోసియేషన్స్ తో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రైవేటీకరణ వ్యూహాలపై ఉద్యోగ సంఘాలు చర్చించనున్నాయి. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఏపి పిటిడి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోషియేషన్ అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు, ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు ఓ ప్రకటన చేశారు. ఆర్టీసీ దశాభ్దాలుగా ప్రభుత్వ రంగ సంస్థగా లక్షలాది మంది ప్రజలకు సేవలందిస్తున్న బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రైవేటీకరణ చర్యలకు దారితీసే ప్రభుత్వం నిర్ణయాలు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని వారు పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications