APSRTCలో 7673 ఉద్యోగాల భర్తీ..! ప్రమోషన్లు, బకాయిలపై క్లారిటీ...!
ఏపీలో ఆర్టీసీ (APSRTC) వ్యవహారాలపై ఇవాళ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. ఇందులో ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లు, నియామకాలు, బకాయిల చెల్లింపులు, వైద్య కారణాలతో రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలు, కారుణ్య నియామకాలు, సీనియారిటీ జాబితాలు, కోర్టు కేసుల స్థితిగతులపై మంత్రి విస్తృతంగా చర్చించారు.
ఈ సమీక్షలో 2025-26 డీపీసీ కింద అర్హులైన 7,514 మంది ఉద్యోగులకు ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. 20-02-2026లోపు ఎంప్యానెల్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. లెవెల్స్ 3, 4, 5 & ఈఈల సీనియారిటీ జాబితాల ఆధారంగా డీపీసీలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
అలాగే వివిధ విభాగాల్లో 7,673 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి కోరనున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.

2020లో 51,488 మంది ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం 44,131 మంది మాత్రమే సేవలలో ఉన్నారని, 2026, 2027, 2028 సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ కానున్నారని మంత్రికి అధికారులు తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్ తదితర పోస్టులకు ప్రాధాన్యతతో భర్తీ చేయాలని మంత్రి సూచించారు. అలాగే 01-01-2020 నుంచి వైద్య కారణాలతో 682 మంది ఉద్యోగులు రిటైర్ అయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 36 మందికి ప్రత్యామ్నాయ ఉద్యోగం, మిగిలిన 646 మందికి ఆర్థిక పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. ఒక్కో ఉద్యోగికి రూ.15 లక్షల చొప్పున మొత్తం ఆర్థిక భారం రూ.96.90 కోట్లుగా అంచనా వేశారు.

అలాగే ఉమ్మడి కడప ప్రాంతంలో కండక్టర్ ఖాళీలు లేకపోవడంతో 191 కారుణ్య నియామక దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. 28-09-2023, 29-09-2023 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తైనా ఇప్పటివరకు నియామకాలు జరగలేదని, ఆర్టీసీలో పదేపదే ఫాలోఅప్ చేసినా కలెక్టర్ కార్యాలయం నుంచి స్పష్టమైన స్పందన రాలేదని అధికారులు మంత్రికి వివరించారు. కడప ప్రాంతానికి చెందిన 80 మంది కండక్టర్లు ఇతర రీజియన్లలో పని చేస్తున్నారని తెలిపారు. అలాగే వివిధ కేడర్ల సీనియారిటీ జాబితాల పునఃపరిశీలనకు 30-01-2026న మెమో జారీ చేసినట్లు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ మెమోల ప్రకారం సీనియారిటీ జాబితాల సమీక్ష జరుగుతుందన్నారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications