మంచు కురిసే వేళలో.. అరకులోయ అందాలు.. పోటెత్తిన పర్యాటకులు!

'ఆంధ్రా ఊటీ'గా పేరొందిన అరకులోయ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. వారంతం ఆదివారం కావటంతో నేడు తెల్లవారుజాము నుంచే ప్రకృతి ప్రేమికులు మడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్‌కు భారీ సంఖ్యలో చేరుకుని, మంచు దుప్పటి కప్పుకున్న కొండల నడుమ ఉదయించే సూర్యుడి అందాలను కనులారా వీక్షించారు. చల్లటి గాలులు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

అంతేకాకుండా స్థానిక గిరిజనులతో కలిసి సంప్రదాయ థింసా నృత్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఆనందంగా గడిపారు. ఇటీవల వరుస తుఫానులు, ప్రతికూల వాతావరణం కారణంగా మందగించిన పర్యాటక రంగం ఆదివారం నాడు ఒక్కసారిగా పుంజుకోవడంతో స్థానిక చిరు వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు, గిరిజన కళాకారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Araku Valley Tourists Flock to Araku Valley on Sunday to Enjoy Misty Weather and Scenic Beauty

శీతాకాలం ప్రారంభం కావడంతో అరకులోయలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా నవంబర్ నెల నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ ఉండే మంచుతో కూడిన చల్లటి వాతావరణం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. అరకు పర్యటనకు వచ్చే సందర్శకులు కేవలం వ్యూ పాయింట్లకే పరిమితం కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక అద్భుతమైన ప్రదేశాలను సందర్శించవచ్చు.

ప్రకృతి రమణీయతకు నిలయమైన బొర్రా గుహలు, జలపాతాల సవ్వడితో అలరించే చాపరాయి, కటిక వాటర్ ఫాల్స్ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అలాగే దక్షిణ భారతదేశంలోనే ఏకైక మంచు ప్రాంతమైన లంబసింగి, మేఘాల కొండగా పిలిచే వంజంగి ప్రాంతాలు ట్రెక్కింగ్ ప్రియులకు స్వర్గధామంగా నిలుస్తున్నాయి.

ఇక అరకు ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇక్కడి గిరిజన మ్యూజియం, కాఫీ తోటలు, పద్మాపురం గార్డెన్స్ తప్పక చూడాల్సిన ప్రదేశాలు. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'అరకు కాఫీ' రుచి చూడటంతో పాటు, ఇక్కడి చాక్లెట్ ఫ్యాక్టరీలో తయారయ్యే వివిధ రకాల చాక్లెట్లను కొనుగోలు చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.

తెలంగాణాకు పోటెత్తిన ఇతర రాష్ట్రాల కూలీలు.. కారణం ఇదే!
తెలంగాణాకు పోటెత్తిన ఇతర రాష్ట్రాల కూలీలు.. కారణం ఇదే!

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే హస్తకళా వస్తువులు, వెదురు బొంగు చికెన్ వంటి స్థానిక వంటకాలు పర్యాటకులకు మధురమైన అనుభూతిని అందిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పర్యాటకుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అరకు అందాలను చూడటానికి రైల్వే విశాఖ నుండి అద్దాల రైలును కూడా నడుపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+